టీమ్ ఇండియా ద‌క్షిణాప్రికా మ‌ధ్య జ‌రుగుతున్న రెండ‌వ వ‌న్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఖాతా తెర‌వ‌కుండానే  డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. అయితే కోహ్లీ పేరిట ఒక రికార్డు న‌మోదు అయింది. ఇలాంటి రికార్డు కేవ‌లం కొద్దిమంది భార‌తీయ ఆట‌గాళ్ల పేరుమీద మాత్ర‌మే ఉన్న‌ది. ద‌క్షిణాఫ్రికాలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి కెరీర్ ప‌రంగా 450వ అంత‌ర్జాతీయ మ్యాచ్‌. ఈ గ‌ట‌న సాధించిన నాలుగ‌వ భార‌త ఆట‌గాడిగా కోహ్లీ నిలిచాడు. ఇప్ప‌టివ‌ర‌కు కోహ్లీ అంత‌ర్జాతీయ కెరీర్ ఎలా ఉన్న‌దో ఒక సారి తెలుసుకుందాం.

భార‌త జ‌ట్టు తరుపున 450 అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడిన నాలుగ‌వ ఆట‌గాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. 450వ అంతర్జాతీయ మ్యాచ్.. భారత్ నుంచి 450వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన నాలుగో ఆటగాడిగా విరాట్‌ కోహ్లి నిలిచాడు. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ఇప్పటివరకు 256 వన్డే మ్యాచ్‌ల‌ను ఆడాడు. ఇందులో అతను 12, 220 పరుగులు చేసాడు. ఈ ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ 43 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలను సాధించాడు. విరాట్ కంటే ముందు ఈ రికార్డు సాధించిన వారిలో సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ మహేంద్రసింగ్ ధోనిలు  ఉన్నారు. క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలో పరుగులు చేశాడు అరుగుల పరంగా అందరూ దిగ్గజాలను వెనక్కి నెట్టాడు ఈ మ్యాచ్లో చిరస్మరణీయమైన అది కుదరక పోవడంతో ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.

 ఇక టీ20 కెరీర్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ 95 టి20 లు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు అందులో 3227 పరుగులు చేసాడు. పొట్టి క్రికెట్ లో కోహ్లీ 29 అర్థ శతకాలు సాధించాడు కోహ్లీ. కానీ ఇప్పటివరకు ఒక్క సెంచ‌రీ కూడా  లేకపవడం గమనార్హం.మరొకవైపు టెస్ట్ కెరీర్లో విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు 99 మ్యాచ్లోనూ ఆడాడు అతను 168  ఇన్నింగ్స్‌లో  7962 పరుగులు చేసాడు.  ఫార్మాట్ లో కోహ్లీ 27 సెంచ‌రీలు 28 అర్ధ సెంచ‌రీలు సాధించాడు.  టెస్టులకు  ఏడు ఏళ్లపాటు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత ఇటీవ‌లే కెప్టెన్ ప‌ద‌వీని వ‌దులుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: