మ్యాచ్ జరుగుతున్న సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్లు కొన్ని కొన్ని సార్లు స్టన్నింగ్ క్యాచ్ ల తో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్యాచ్ లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఒక వైపు బౌండరీ లైన్ దాటకుండా జాగ్రత్త పడుతునె మరోవైపు గాల్లోకి ఎగురుతూ క్యాచ్లు పడుతూ ఉంటారు. ఇలాంటి క్యాచ్ లు పట్టినప్పుడు ఆటగాళ్లు ఎంత ఫిట్నెస్తో ఉన్నారు అన్న విషయం అర్థం అవుతూ ఉంటుంది. ఇకపోతే ఇటీవలే బిగ్ బాష్ లీగ్ లో కూడా ఇలాంటి ఒక అద్భుతం క్యాచ్ కొద్దిలో మిస్సయింది అని చెప్పాలి. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.



 ఒకవేళ ఫీల్డర్ క్యాచ్ పట్టి ఉంటే మాత్రం ఇక ఇది క్రికెట్ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిపోయేది అన్నది మాత్రం పక్క గా చెప్పవచ్చు. ఇటీవలే బిగ్ బాష్ లీగ్ లో భాగంగా హోబార్ట్ హరికేన్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది.  ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ లో 13.1 ఓవర్లలో మూడవ బంతి మార్ట్ షార్ట్ లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ కొట్టాడు. అయితే అక్కడే ఉన్న ఫీల్డర్ పార్కర్ పరిగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి ఎగిరి మరి స్టన్నింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. కాని కిందకి ల్యాండ్ అయ్యే సమయంలో మాత్రం బౌండరీ టచ్ అయ్యాడు. దీంతో ఏమీ చేయలేక బంతి విసిరేసాడు. అయితే ఇంత గొప్ప క్యాచ్ పట్టినప్పుటికీ అతను బౌండరీ లైన్ ని సరిగ్గా అంచనా వేయకపోవడం తో పడిన శ్రమ మొత్తం వృధా గా మిగిలిపోయింది.



 ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో అతను బౌండరీ లైన్ గమనించి ఈ క్యాచ్ పట్టుకుని ఉంటే క్రికెట్ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన  క్యాచ్ గా మిగిలిపోయేది అంటూ కామెంట్లు పెడుతున్నారు ఎంతోమంది. ఇక ఈ మ్యాచ్లో ఆడి లైట్ స్ట్రైకర్స్ 22 పరుగులతో విజయాన్ని అందుకోవడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్  స్ట్రైకర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికెన్స్  మాత్రం 19.4 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌట్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: