ఇండియా మరియు సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న సిరీస్ ముగింపుకు చేరుకుంది. రేపు కేప్ టౌన్ వేదికగా జరగబోయే మూడవ వన్ డే తో ఇండియా పర్యటన ముగుస్తుంది. పటిష్టమైన టీమ్ మరియు అనుభవం కలిగిన కెప్టెన్ లేని సౌత్ ఆఫ్రికా చేతిలో దారుణం గా టెస్ట్ సిరీస్ ను పోగొట్టుకున్నారు. ఇప్పుడు వన్ డే సిరీస్ ను కూడా కోల్పోయి అందరి నుండి తిట్లు తింటున్నారు. రేపు కేప్ టౌన్ లో మూడవ ఆఖరి వన్ డే జరగనుంది. కనీసం ఈ మ్యాచ్ లో అయినా గెలిచి కాస్త పరువు దక్కించుకోవాలని ఇండియా యాజమాన్యం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా రేపటి వన్ డే లో కెప్టెన్ ను మార్చాలని భావిస్తోంది.

ఇప్పటికే విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ ల నుండి కెప్టెన్ గా తప్పుకోగా ఇండియా టీమ్ భవిష్యత్తు కష్టాల్లో పడినట్లు అయింది. అందుకే నెక్స్ట్ సరైన కెప్టెన్ ఎవరా అని వెతుకుతోంది. వారిలో మూడు ఆప్షన్ లు ఉన్నాయి. ఒకరు రోహిత్ శర్మ కాగా ఇతను మ్యాచ్ ల కంటే గాయాలతో రెస్ట్ తీసుకున్న రోజులు ఎక్కువ, ఫిటినెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే తదుపరి ఆప్షన్ గా కే ఎల్ రాహుల్ ను ఎంచుకుంది టీమ్ ఇండియా యాజమాన్యం. కానీ రాహుల్ అటు టెస్ట్ లు ఇటు వన్ డే లు రెండు ఫార్మాట్ లలోనూ ఒక నాయకుడిగా విఫలం అయ్యాడు. అందుకే ఇక ఆఖరి ఆప్షన్ గా ఒకసారి యంగ్ వికెట్ కీపర్ మరియు ధనా ధన్ బ్యాట్సమన్ రిషబ్ పంత్ ను పరిశీలించాలని చూస్తోంది.

ఇప్పటికే ఒక కెప్టెన్ గా తాను ఏమిటో ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను 2021 సీజన్ లో టేబుల్ టాపర్ గా నిలిపాడు. అందుకే అతని సామర్ధ్యాన్ని టెస్ట్ చేయడానికి ఇక సిరీస్ ఎలాగూ పోయింది అని ఈ మ్యాచ్ లో పంత్ ను కెప్టెన్ గా చేయనున్నారు. మరి ఇది ఇప్పటి వరకు ఒక గాసిప్ మాత్రమే ఒకవేళ ఇది నిజం అయితే పంత్ ఎలా జట్టును ముందుండి ఎలా నడిపిస్తాడో చూడాలని తన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: