రేపు కేప్ టౌన్ లో జరగబోయే మూడవ వన్ డే లో ఇండియా గెలవడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఎలాగూ సీరీస్ చేజారింది కదా లైట్ తీసుకుంటారు అను అనుకుంటే పొరపాటు పడినట్లే... సఫారీ పర్యటనలో ఆఖరి మ్యాచ్ కావడంతో విజయంతో సౌత్ ఆఫ్రికాను వీడాలని ఇండియా అనుకుంటోంది. కానీ ఇది జరుగుతుందా లేదా అనేది రేపు మ్యాచ్ లో ఎలా ఆడుతారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఎంతటి మ్యాచ్ విన్నర్లు అయినా? వరల్డ్ నంబర్ వన్ జట్టు అయినా? మ్యాచ్ రోజున ఏ విధంగా ఆడుతుంది అనేది ముఖ్యం. కాబట్టి రేపు ఉత్తమమైన ప్రదర్శన కనబరిచిన వారినే విజయం వరించనుంది.

ఇప్పటికే వరుస మ్యాచ్ లు ఓడిపోయి ఇండియా తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల నుండి తేరుకుని మ్యాచ్ గెలవడం అంటే అంత తేలికైన విషయం కాదు. అయితే గెలిచేందుకు అవకాశాలు లేకపోలేదు. రేపు టీమ్ ఇండియా ఈ విషయాలు పాటిస్తే ఈజీగా సఫారీలను మట్టి కరిపించి విజయంతో ఈ పర్యటనను ముగించవచ్చు.

* ముందుగా నిన్నటి వరకు ఏమి జరిగింది అనే విషయం మరచిపోవాలి. నేడు ఎలా ఆడాలి అనే దానిపై దృష్టిని కేంద్రీకరించాలి. ఆ దిశగా ప్లాన్ ఉండాలి.

* రేపు టాస్ ఇండియా గెలిస్తే మొదటగా ఫీల్డింగ్ తీసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇక్కడ పిచ్ లో ఏమీ లేదు. మొదటి మరియు రెండవ వన్ డే లలో పిచ్ వలన గెలుపు దూరం కాలేదు. కీలక సమయంలో సరైన ప్రదర్శన చేయకపోవడం కారణంగా ఓడిపోయింది. కాబట్టి ఏమీ ఆలోచించకుండా ఫీల్డింగ్ తీసుకోవాలి.

* టీమ్ విషయంలో కీలక మార్పులు అవసరం. ముందుగా వరుసగా విఫలం అవుతున్న శ్రేయాస్ ను తప్పించి రుతురాజ్ లేదా ఇషాన్ కు అవకాశం ఇవ్వాలి. వెంకటేష్ అయ్యర్ కు మరిన్ని అవకాశాలు ఇవ్వడం మంచిదే. అయ్యర్ లో టాలెంట్ ఉంది కానీ నిలదొక్కుకునే అవకాశం ఇవ్వాలి.

* బౌలింగ్ విభాగంలో సీనియర్ భువి మరియు అశ్విన్ లను పక్కన పెట్టి సిరాజ్ మరియు జయంత్ లను ఆడించాలి.

* ఇక కెప్టెన్ రాహుల్ ఫీల్డింగ్ మరియు బౌలర్లను రొటేట్ చేసే విషయంలో మాజీ కెప్టెన్ సలహాలను తీసుకోవాలి. ఇక్కడ ఇగో ఫిలింగ్ పెట్టుకుంటే జట్టు ఓటమి చెందే అవకాశం ఉంది. అలాగే రాహుల్ బ్యాటింగ్ కి వస్తే తన ఆట ఆడాలి. కెప్టెన్ కదా అని పూర్తిగా ఆత్మసంరక్షణలో ఆడడం సరికాదు.

* ఇక ఆటగాళ్లు ఏ విదమైన తొందరపాటు పడకుండా నెమ్మదిగా ఆచితూచి ఆడితే పరుగులు అవే వస్తాయి. ముఖ్యంగా బౌన్సర్ లను మరియు సఫారీ స్పిన్నర్ లను ఎదుర్కోవడంలో పంత్ మినహా అందరూ విఫలం అవుతున్నారు. స్పిన్ బౌలింగ్ లో రొటేట్ చేయడం ఒక్కటే మార్గం. అప్పుడే బౌలర్ గతి తప్పుతాడు.

ఇలా అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని బరిలోకి దిగితే విలయం ఇండియాదే.


మరింత సమాచారం తెలుసుకోండి: