ఎన్నో ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతమైన సేవలు అందించి ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్కు దూరమైన ఆటగాళ్లు అందరిని మళ్ళీ మైదానంలోకి దింపేందుకు మళ్ళీ క్రికెట్ ఆడేలా చేసేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లెజెండ్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ లెజెండ్ క్రికెట్ లీగ్ ప్రారంభం కాగా ప్రతి మ్యాచ్  హోరాహోరీగా జరుగుతుంది. అన్ని దేశాలకు చెందిన క్రికెట్ లెజెండ్స్  కూడా బరిలోకి హోరాహోరీగా మరోసారి తలబడుతూ ఉన్నారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎంతోమంది సీనియర్ ఆటగాళ్లు కూడా ఇక లెజెండ్ క్రికెట్ లీగ్లో ఆడుతూ ఉండటం గమనార్హం.


 కాగా ఇండియా లెజెండ్స్ క్రికెట్ టీం మహారాజాస్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న మహారాజాస్ జట్టుకు  ఇటీవలే షాక్ తగిలింది. సౌతాఫ్రికా జట్టు టీమిండియా లెజెండ్స్ జట్టు విజయాలకు బ్రేక్ వేసిం.ది ఇటీవల జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా పై విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించడానికి సౌత్ ఆఫ్రికా దిగ్గజ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కారణం అనే చెప్పాలి.అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహించాడు. మెరుపు ఇన్నింగ్స్ తో ఔరా అనిపించాడు ఇమ్రాన్ తాహీర్. లెజెండ్ క్రికెట్ లీగ్ 2022 లో భాగంగా సౌత్ ఆఫ్రికా కు చెందిన వరల్డ్ జయింట్స్ ఇండియా కు చెందిన మహారాజాస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.



 ఈ మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసింది ఇండియా మహారాజాస్ జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. భారత సీనియర్ బ్యాట్స్మెన్ నమన్ ఓజా 69  బంతుల్లో 140 పరుగులు చేసి అదరగొట్టాడు అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేసింది వరల్డ్ జాయింట్స్ జట్టు. కాగా భారత బౌలర్లు సౌత్ఆఫ్రికా బ్యాటర్ లను కట్టడి చేయడంలో విఫలం అయ్యారు. ఈ క్రమంలోనే  కెవిన్ పీటర్సన్ 53 రన్స్ చేసి రాణించాడు. ఈ క్రమంలోనే మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసిన ఇమ్రాన్ తాహీర్ ఏకంగా 19 బంతుల్లో 52 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ లో కొనసాగిన ఇమ్రాన్ తాహీర్ అద్భుతంగా రాణించడంతో ధోని ఫుల్ హ్యాపీ అయ్యాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: