* టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకోవడం చాలా అవసరం. అలా కాకుండా ముందు వన్ డే లాగా చేస్తే మ్యాచ్ గోవిందా!
* బౌలర్లు ఆరంభంలో వికెట్లు తీయాలి. మొదటి పవర్ ప్లే లో కనీసం రెండు వికెట్లు తీయగలిగితే ప్రత్యర్థిని ఈజీగా ఒత్తిడిలోకి నెట్టేయచ్చు.
* ఫీల్డింగ్ లో లోపాలను సరిచేసుకోవాలి. మీరు వదిలేసే ప్రతి ఒక్క క్యాచ్ చాలా నష్టాన్ని కలిగిస్తుంది. రెండవ వన్ డే లో రిషబ్ పంత్ వదిలేసిన స్టంపింగ్ వల్ల డికాక్ మ్యాచ్ ను లాగేసుకున్నాడు. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకూడదు.
* బ్యాట్స్మన్ ని బట్టి బౌలింగ్ మరియు ఫీల్డింగ్ ని మారుస్తూ ఉండాలి. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ ను బాగా వాడుకోవాలి.
* ప్రత్యర్థి జట్టును 250 పరుగుల లోపు కట్టడి చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయి.
* విరాట్ కోహ్లీ సలహాలను రాహుల్ తప్పక తీసుకోవాలి, అలాగే కోహ్లీ ఇంకా కొంచెం ఇన్వల్వెమెంట్ పెంచుకోవాలి.
* ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే, ధావన్ మరియు రాహుల్ లు మొదటి పవర్ ప్లే లో వికెట్ పడకుండా కనీసం బంతికి ఒక పరుగు చొప్పున తీయాలి. అప్పుడే ఒత్తిడి ఉండదు. నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మన్ స్వేచ్ఛగా ఆడగలడు.
* ఒకవేళ ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ ను తీసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ లో ఇంకొంచెం ముందుగా పంపడానికి చూడండి. మాములుగా శ్రేయాస్ అయ్యర్ పంత్ వచ్చే స్థానంలో బాగా ఆడగలడు. పంత్ ఎక్కడైనా ఆడే సామర్ధ్యం ఉంది కాబట్టి ఈ ప్రయోగం చేస్తే బాగుంటుంది.
* సౌత్ ఆఫ్రికా బౌలర్లలో శంసి, మార్ క్రామ్ మరియు మహారాజ్ లు ఎంత ప్రమాదమో గత వన్ డే లో చూశాము. కాబట్టి వీరి బౌలింగ్ లో భారీ షాట్ లకు పోకుండా గ్యాప్ లలో ఆడేందుకు ప్రయత్నించాలి.
ఈ గేమ్ ప్లాన్ ప్రకారం రాహుల్ టీమ్ ను నడిపించగలిగితే ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది.