మొన్నటి వరకు భారత క్రికెట్లో 3ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ ఇటీవలే అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకొని ప్రస్తుతం జట్టులో ఒక సాదాసీదా ఆటగాడిగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ముందుగా విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోగా ఆ తర్వాత తర్వాత బీసీసీఐ అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ షాక్ ఇచ్చింది. ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా టెస్టు సిరిస్ ఓడిపోవడంతో ఇక టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించి షాకిచ్చాడు. అయితే విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవడం సంచలనంగా మారిపోయింది.


 గత కొంతకాలం నుంచి ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడం గురించే ఆసక్తికర చర్చ జరుగుతోంది.  ఇప్పటికే భారత మాజీ క్రికెటర్ లతో పాటు విదేశీ క్రికెటర్లు కూడా ఈ విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తాము అంటూ అటు టీమిండియా క్రికెటర్లు కూడా స్పందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయంపై పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ  విషయంలో తలెత్తిన ఇబ్బందికర పరిస్థితులను పక్కనపెట్టి ఇక కోహ్లీ ఆటపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించాడు షోయబ్ అక్తర్.



 కెప్టెన్సీ అంటే అంత సులభమైన విషయం కాదు. ఎంతో ఒత్తిడి మధ్య జట్టును ముందుకు నడిపించాల్సి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి కేవలం ఆట పైనే  దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించాడు. అదేసమయంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీ కి వ్యతిరేకంగా కొంతమంది వ్యవహారాలు నడిపాడని ఆరోపించాడు. అందుకే అతను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. క్రికెట్ లో స్టార్ స్టేటస్ ఉన్న వాళ్లకి ఇబ్బందులు తప్పవు అంటూ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేవలం ఆట ని ఆస్వాదిస్తూ ముందుకు సాగాలి అంటూ హితవు పలికాడు షోయబ్ అక్తర్. యావద్దేశం కోహ్లీపై గౌరవంతో ప్రేమిస్తుందని ఇక కొన్ని కొన్ని సార్లు ప్రతి ఆటగాడికి ఇలాంటి పరీక్షలు తప్పవు కోహ్లీ కి మద్దతుగా నిలిచాడు షోయబ్ అక్తర్.

మరింత సమాచారం తెలుసుకోండి: