విరాట్ కోహ్లీ అనుష్క శర్మ కూతురు వామిక ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక విరాట్ అనుష్క జంటకు కూతురు పుట్టడంతో అభిమానులు అందరూ ఎంతగానో ఆనంద పడిపోయారు. ఈ క్రమంలోనే తమ అభిమాన సెలబ్రిటీల కూతురు ఎలా ఉందో చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ దాదాపు ఏడాది సమయం నుంచి అభిమానులకు నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా కూడా విరాట్ కోహ్లీ గానీ అనుష్క గాని తమ కూతురు ఫోటోని రివీల్ చేయలేదు.


 వామికకు సంబంధించిన ఫోటోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ గా మారిపోయాయి. కానీ ముఖం మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఇక వామిక ఫోటోలు చూడాలి అని ఎంతో మంది అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. విరుష్క జంట వామిక ఫోటోలను ఎప్పుడు విడుదల చేస్తారా అని సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతలోనే విరాట్ కోహ్లీ-అనుష్క కూతురు వామిక ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు ట్రెండింగ్ గా మారిపోయాయి.. ఇన్ని రోజుల వరకు వామిక ఫోటోలు బయటపడకుండా మీడియా కంట పడకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు విరుష్క జంట.


 కానీ ఇప్పుడు మాత్రం వామిక ఫోటోలు సోషల్ మీడియాలో కి వచ్చేసి వైరల్ గా మారిపోయాయి. అసలేం జరిగిందంటే ఇటీవలే సౌత్ఆఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు వన్డే సిరీస్ ఆడింది. ఇటీవల జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భాగంగా విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూతురితో పాటు హాజరయ్యింది. డ్రెస్సింగ్ రూమ్ వద్ద అనుష్క వామిక ని ఎత్తుకొని ఉన్న ఒక దృశ్యం కెమెరాలో ఇబ్బంది. అయితే ఈ ఫోటోలన్నీ సౌత్ ఆఫ్రికా కెమెరామెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: