సౌత్ఆఫ్రికా జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న క్వింటన్ డికాక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. భారీగా పరుగులు చేస్తూ జట్టును విజయతీరాలకు వైపు నడిపించడంలో ముందున్నాడు క్వింటన్ డికాక్. ఇక ఇటీవలే టీమిండియా తో జరిగిన వన్డే సిరీస్లో కూడా అద్భుతంగా రాణించి అదరగొట్టాడు అనే చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం సౌతాఫ్రికాలో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న క్వింటన్ డికాక్ ఇటీవలే తండ్రి అయ్యాడు. ఈ స్టార్ ప్లేయర్ కి ఒక అందమైన కూతురు పుట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల కూతురికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు క్వింటన్ డికాక్.
ఇటీవలే టీమిండియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన పోయాడు. ఒక రకంగా జట్టుకు విజయం అందించడమే కాదు మరోవైపు కూతురికి కూడా ఎప్పటికీ మరిచిపోలేని ఒక అద్భుతమైన బహుమతి ఇచ్చేశాడు క్వింటన్ డీకాక్. సెంచరీ చేసి అభివాదం చేస్తుండగా అతని భార్య సాషా కూతురునూ పట్టుకుని టీవీ దగ్గర నిలబడి ఫోటో తీసుకున్నారు. ఈ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వెల్ డన్ డాడీ అంటూ కామెంట్ జత చేసింది. ఇక ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఈ ఫోటో ఎంతోమంది మనసు దోచేస్తోంది.