దేశం తరఫున ఆడుతున్న జట్టుకు కెప్టెన్సీ వహించడం అంటే ప్రతి క్రీడాకారుడు కల నెరవేరినట్లే. ఇక సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా ఇలాంటి కల నెరవేర్చుకున్నాడు కేఎల్ రాహుల్. కానీ కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీకి మొదట్లోనే చేదు అనుభవం ఎదురైంది. కేఎల్ రాహుల్  కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా మొదటి సిరీస్లోనే వైట్ వాష్  కి గురి కావడంతో అతని కెప్టెన్సీపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ అసమర్థత కారణంగానే టీమిండియా ఓడిపోయింది అంటూ ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



 అతని వ్యూహాలు సరిగా లేకపోవడం వల్లనే దక్షిణాఫ్రికా అద్భుతమైన విజయం సాధించగలిగింది అంటూ కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.  టీమిండియాను సమర్థవంతంగా ముందుకు నడిపించడంలో కె.ఎల్.రాహుల్ పూర్తిగా విఫలం అయ్యాడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న వేళ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందిస్తూ కెఎల్ రాహుల్ కు అండగా నిలిచాడు. కేఎల్ రాహుల్  రాహుల్ కెప్టెన్సీ బాగుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. సారథిగా తన బాధ్యతను చక్కగా నెరవేర్చాడని ప్రశంసలు కురిపించాడు. ఇప్పుడిప్పుడే జాతీయ జట్టుకు కెప్టెన్సీ చేపట్టిన కేఎల్ రాహుల్  పోను పోను కెప్టెన్సీలో మరింత మెరుగు పడతాడు అంటూ రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. సౌత్ ఆఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ లో మూడు మ్యాచ్ లలో ఓడిపోవడం మాకు కనువిప్పు లాంటిదే అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగాల్సిందే అంటూ తెలిపాడు.



ఇకపోతే ప్రస్తుతం కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న వేల అటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం కేఎల్ రాహుల్  ను వెనకేసుకు రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక పోతే ఇక టీమిండియా ఆడబోయే తదుపరి సిరీస్లకు అటు  రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో టెస్ట్ ఫార్మట్ కి కొత్త కెప్టెన్ ఎవరు అన్నదానిపై కూడా రానున్న రోజుల్లో ఓ క్లారిటీ రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: