ఎవరూ ఊహించని విధంగా బీసీసీఐ విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా విరాట్ కోహ్లీ ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం పెద్ద వివాదం గానే మారిపోయింది. మేము టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దు అని విరాట్ కోహ్లీకి సూచించామని పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు ఒకే కెప్టెన్ ఉండాలి అని భావించి విరాట్ కోహ్లీ  వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించాల్సి వచ్చింది అంటూ బీసీసీఐ తెలిపింది. అయితే అటు వెంటనే ప్రెస్ మీట్ నిర్వహించినా విరాట్ కోహ్లీ తనకు ఎవరు టి 20 కెప్టెన్సీ  నుంచి తప్పుకో వద్దు అంటూ చెప్పలేదని..  అంతే కాకుండా కేవలం ఒక గంటన్నర ముందు మాత్రమే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం అందించారు అంటూ బాంబు పేల్చడంతో కెప్టెన్సీ నుంచి తప్పించడం పెద్ద వివాదంగా మారిపోయింది.


 ఇక టు విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది కెప్టెన్ గా ఎవరిని కొనసాగించాలి అన్నది అది కలెక్టర్ల చేతిలోనే ఉంటుందని అంటూ ఉంటే.. మరికొంతమంది బిసిసిఐ విరాట్ కోహ్లీ విషయంలో చేసింది తప్పు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ తర్వాత కాలంలో అటు టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే విరాట్ కోహ్లీ వన్డే సారథ్యం నుంచి తప్పించడంపై ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి.



 ఇటీవల ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించిన విధానం సరిగా లేదు అంటూ పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు భారత క్రికెట్ చరిత్రలో పేలవా చిత్రాన్ని ఆవిష్కరించాయి అంటూ లతీఫ్ కామెంట్స్ చేశాడు. అయితే ప్రస్తుతం అందరూ రోహిత్ శర్మ జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడు అన్న దానిపైనే దృష్టి పెట్టే అవకాశం ఉంది అటు వ్యాఖ్యానించిన రషీద్ లతీఫ్.. కోహ్లీ విషయంలో బీసీసీఐ అతి పెద్ద తప్పు చేసింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ఈ విషయం ఇండియా క్రికెట్ పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు అంటూ వ్యాఖ్యానించాడు. ఆర్థిక శక్తితో పాటు సంక్షోభం తట్టుకునేంత ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఎంతోమంది బిసిసిఐ దగ్గర ఉన్నారూ అంటూ లతీఫ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: