ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా ఘోరంగా విఫలమైంది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా కనీసం ఒక్క సిరీస్ లో కూడా విజయం సాధించలేకపోయింది. మొదటి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా ఆ తర్వాత మాత్రం అదే జోరును కొనసాగించలేక పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మునుపెన్నడూ లేని విధంగా పేలవమైన ఫామ్ లో కనిపించిన టీమిండియా ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే టీమిండియా పేలవ ఫామ్ లో ఉండడంతో ఎంతోమంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు.



 ఇక టీమిండియా పేలవ ప్రదర్శన పై దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సేవలను కోల్పోవడం కారణంగానే విఫలం అయ్యింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. రవీంద్ర జడేజా ఒక అద్భుతమైన క్రికెటర్ అంటూ చెప్పుకొచ్చాడు. అతను తన స్పిన్ మాయాజాలంతో ఆటను ఏ క్షణంలోనైనా మలుపు తిప్ప గల సమర్ధుడు. అదే సమయంలో బ్యాటింగ్ లో కూడా రాణిస్తూ అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉంటాడు.ఇక సౌతాఫ్రికా టూర్ లో రవీంద్ర జడేజా అందుబాటులో లేకపోవడం టీమిండియాకు ఎంతగానో మైనస్ గా మారిపోయింది అంటూ డేల్ స్టెయిన్ చెప్పుకొచ్చాడు.



 ఇక అదే సమయంలో భారత ఫేసు దళం గురించి మాట్లాడుతూ భారత్కు బౌలింగులో కొంత సమస్య ఉంది అన్నది వాస్తవం అంటూ చెప్పుకొచ్చాడు. జస్ప్రిత్ బూమ్రా కు బ్యాక్అప్ గా ఒక మంచి బౌలర్ కావాలి ఇక టీమిండియాకు 145 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే ఒక బౌలర్ ఎంతో అవసరం.. టెస్ట్ సిరీస్ లో మహ్మద్ షమీ అద్భుతంగా రాణించాడు అంటూ డెల్ స్టేయిన్ చెప్పుకొచ్చారు.. అయితే అటు మిడిలార్డర్లో వైఫల్యం కారణంగానే టీమిండియా ఘోర ఓటమి చవిచూడాల్సనా పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే రవీంద్ర జడేజా హార్దిక్ పాండ్యా లాంటి స్టార్ ఆల్రౌండర్ టీమిండియాకు అవసరం అంటూ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: