ఒకప్పుడు భారత జట్టుకు మూడు ఫార్మాట్లకు కూడా కెప్టెన్గా కొనసాగుతూ దూసుకుపోయాడు విరాట్ కోహ్లీ. కేవలం కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించడమే కాదు అటు జట్టులో కీలక ఆటగాడిగా కూడా కూడా ఎంతో అద్భుతమైన బ్యాటింగ్తో జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు ఉన్నాయి.  అయితే మైదానంలో విరాట్ కోహ్లీ ఎంతో దూకుడుగా కనిపిస్తూ ఉంటాడు అనే విషయం  తెలిసిందే. చిన్న విషయానికి కూడా కాస్త అగ్రెసివ్ గానే రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఇక వికెట్ పడింది అంటే చాలు బౌలర్ కంటే ఎక్కువగా విరాట్ కోహ్లీ ఎమోషన్స్ చూపిస్తూ ఉంటాడు.



 ఇక ప్రత్యర్థులు ఎవరైనా కామెంట్స్ చేసిన కౌంటర్ ఇచ్చేందుకు విరాట్ కోహ్లీ ఎప్పుడు ముందు ఉంటాడు. కానీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం విరాట్ కోహ్లీ ఎంతో సైలెంట్ గా కనిపిస్తున్నాడు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీని కోల్పోయాడు. ఈ క్రమంలోనే జట్టులో మళ్లీ ఒక సాదాసీదా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా మాత్రమే కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ.. ఇకపోతే ఇటీవలే కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ ఒక సాధారణ బ్యాట్మెన్గా ఆడిన వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ ఎక్కడ ఎమోషన్స్ చూపించ లేదు అని చెప్పాలి. తనను తాను ఎంతగానో నియంత్రించు కున్నాడు.


 ఈ క్రమంలోనే ఇదే విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సౌత్ఆఫ్రికా పర్యటనలో భాగంగా కోహ్లీ కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీలో ఆడిన వన్డే లో ఎమోషన్స్ ఎక్కడా కనిపించలేదు. అసలు కోహ్లీల ఎక్కడ ప్రవర్తించలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కోహ్లికి కొంత  రెస్ట్ ఇస్తే బెటర్. అయితే గత రెండేళ్ల నుంచి విరాట్ కోహ్లీ మైదానంలో ఒక్కసారి కూడా సెంచరీ నమోదు చేయలేదు అన్నది వాస్తవం. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా కోహ్లీలో ఎమోషన్స్ మాత్రం ఎక్కువగానే ఉంటాయి. కానీ వన్డే సిరీస్లో అవి కనిపించలేదు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ లో లేకపోతే రోహిత్ శర్మ జట్టు పై పట్టు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ బ్రాడ్ హాగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: