సాధారణంగా బరిలోకి దిగిన బ్యాట్స్ మెన్లు ఎప్పుడూ భారీ సిక్సర్లు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు బ్యాట్స్మెన్లు బలంగా కొట్టే సిక్సర్లు  స్టేడియం అవతల పడటం లాంటి కూడా చూస్తూ ఉంటాం. ఇక ఇలాంటి భారీ సిక్సర్లు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. గతంలో మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన సిక్సర్ ఒక హోటల్ దగ్గర పడిపోవడం లాంటి ఘటన జరిగింది అన్న విషయం తెలిసిందే. ఒకవేళ మైదానం చిన్నగా ఉంది అంటే ఇక అసలు ఊహించని రేంజిలో దూరం వెళ్తూ ఉంటాయి సిక్సర్లు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.


 ఒక బ్యాట్మెన్ కొట్టిన సిక్సర్ కు ఏకంగా అద్దాలు పగిలిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. న్యూజిలాండ్ లో క్రికెట్ మైదానాలు ఎంత చిన్నగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. భారీ సిక్సర్లు కొడితే ఇక బంతి స్టేడియం బయటికి వెళ్ళి పోతూ ఉంటుంది. ఇకపోతే ఇటీవల న్యూజిలాండ్ బ్యాటర్ సాంట్నర్ ఒక భారీ సిక్స్ కొట్టగా మ్యూజియం అద్దాలు పగిలిపోయాయి.. ప్రస్తుతం సూపర్ స్మాష్ లీగ్ జరుగుతుంది. వెల్లింగ్టన్ నార్తన్ నైట్స్ మధ్య మ్యాచ్ జరుగగా ఇక ఈ మ్యాచ్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.



 ఇక ఈ మ్యాచ్లో భాగంగా సాంట్నర్ 35 బంతుల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.. ఆరు సిక్సర్లు  నాలుగు ఫోర్లతో చెలరేగిపోయాడు. ఇలా ఎంతో దూకుడుగా ఆడుతున్న సమయంలోనే సాంట్నర్ కొట్టిన ఒక భారీ సిక్స్ స్టేడియం లో ఉన్న మ్యూజియం అద్దాలను పగులగొట్టేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇలా అద్దాలను పగులగొట్టి లోపలికి వెళ్లి పోయిన బంతిని అంపైర్లు బయటకి తీయలేకపోయాడు. ఎందుకంటే స్టేడియంకు ఆనుకొని ఉన్న మ్యూజియానికి తాళం వేసి ఉంది. దీంతో కొత్త బంతితో మ్యాచ్  కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన క్రికెట్ ఫాన్స్ అందరు కూడా అవాక్కవుతున్నారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: