క్రికెట్ లో ఎంతటి అద్భుతం అయినా జరగడానికి ఆస్కారం ఉంటుంది. క్రికెట్ స్టార్ట్ అయిన నాటి నుండి నేటి వరకు ఎన్నో రికార్డులు సృష్టించబడ్డాయి మరియు బద్దలు కాబడ్డాయి. ప్రపంచంలో క్రికెట్ కు ఎంతో మంది ప్రేమికులు ఉన్నారు. ముఖ్యంగా టీ 20 క్రికెట్ వచ్చాక అభిమానుల శాతం పెరిగారనే చెప్పాలి. ఒక ఆటగాడు అంతర్జాతీయంగా తన కెరీర్ ను స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్ళాలి అనుకుంటాడు. ఈ మార్గంలో ఒక విలువైన ఆటగాడిగా మారి తన జట్టుకు ఎన్నో విజయాలను అందించాలని కలలు కంటాడు. అయితే సౌత్ ఆఫ్రికా జట్టుకు చెందిన స్పిన్నర్ సైమన్ హార్మర్ మాత్రం క్రికెట్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫామ్ ను కోల్పోయి జట్టు నుండి తొలగించబడ్డాడు.

ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ టోర్నీలలో ఆడి తానేంటో నిరూపించుకుని మళ్ళీ అంతర్జాతీయ మ్యాచ్ లను ఆడడానికి సిద్ధపడ్డాడు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. హార్మర్ ఆఖరిగా తాను ఆడింది 2015 లో, అయితే ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు అంతర్జాతీయంగా ఏ ఒక్క మ్యాచ్ ఆడింది లేదు. ఇప్పుడు తన ప్రతిభను గుర్తించిన సౌత్ ఆఫ్రికా క్రికెట్ అతనికి మళ్ళీ అవకాశం ఇచ్చింది. అయితే త్వరలోనే న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ను ఆడనుంది. ఈ జట్టులో సైమన్ హార్మర్ ను స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కేశవ్ మహారాజ్ కు బ్యాక్ అప్ గా సెలెక్ట్ చేసింది.

ఇప్పుడు సైమన్ హార్మర్ ఏడు సంవత్సరాల తర్వాత పునరాగమనం చేశాడు. బహుశా ఇలా జరగడం చాలా అరుదు కావొచ్చు. కానీ ఇతను తనలో ఇంకా సత్తా ఉందని వచ్చాడు. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో బాగా రాణించి రెగ్యులర్ టీమ్ సభ్యుడిగా మారనున్నాడా? లేదా అన్నది తెలియాలంటే టెస్ట్ సిరీస్ ప్రారంభం అయ్యే వరకు వెయిట్ చెయ్యాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: