ఈసారి ఐపీఎల్ గురించి అటు క్రికెట్ అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈసారి ఐపీఎల్ సరికొత్తగా ఉండబోతోందని నమ్ముతున్నారు. కారణం ఐపీఎల్ లోకి కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇవ్వటమే. అంతేకాదు ఈ సారి మెగా వేలం కూడా జరిగింది. ఈ క్రమంలోనే లో మెగా వేలంలో భాగంగా మొన్నటి వరకూ ఓకే జట్టును అంటిపెట్టుకుని ఉన్న ఆటగాళ్లు ఇక మెగా వేలంలో జట్ల లోకి వెళ్ళిపోయారూ. దీంతో అన్ని జట్లలోకి కూడా సరికొత్త ఆటగాళ్ల రావడంతో రూపురేఖలు మారిపోయాయి. దీంతో ఏ జట్టు ఎలా రాణిస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవలే మెగా వేలం ముగియడంతో ప్రస్తుతం అందరి దృష్టి కూడా అటు ఐపీఎల్ నిర్వహణ ఎక్కడ జరగబోతుంది అనే దాని పైన ఉంది అని చెప్పాలి.



 దీని గురించే ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మొన్నటి వరకూ భారత్లో ఐపీఎల్ జరుగుతుందా లేక యూఏఈలో జరుగుతుంది అన్న చర్చ మొదలయింది. ఇప్పుడు భారత్ లో  వైరస్ ప్రభావం తగ్గడంతో ఇక ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించడం ఖాయం అన్నది తెలుస్తుంది. అయితే ఒకప్పటిలా ఎక్కువ వేదికలో కాకుండా కేవలం మహారాష్ట్ర కొన్ని వేదికలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోందట మ్ ఇటీవలే స్పోర్ట్స్ ఛానల్ క్రికెట్ బజ్ కొన్ని విషయాలను వెల్లడించింది. 70 మ్యాచ్లను ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించాలని భావిస్తున్నట్లు  చెప్పింది.



 అయితే దాదాపు 70 మ్యాచ్ లను వాంఖడే స్టేడియంలో నిర్వహించాలని అనుకోవడం పై ప్రస్తుతం మిగతా ఫ్రాంచైజీలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వాంఖడే స్టేడియం ముంబై ఇండియన్స్ టీం కి హోమ్ గ్రౌండ్ గా ఉంటుందని.. అక్కడ మ్యాచ్ నిర్వహిస్తే ఆ ఒక్క జట్టుకే కలిసి వస్తుందని అంటూ మిగతా ఫ్రాంచైజీలు బిసిసిఐకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మిగతా జట్లకు హోమ్ గ్రౌండ్ లు లేవని అయితే వాంఖడే స్టేడియంలో కాకుండా పూణే  బ్రబోర్న్ స్టేడియంలో ముంబై ఆడితే ఎలాంటి అభ్యంతరం లేదు అని మిగతా ఫ్రాంచైజీలు అంటున్నాయట..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl