ఇటీవలి కాలంలో ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ టీమిండియా విజయంలో కీలకపాత్ర వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ టీమిండియా క్రికెట్ లో తన పేరు మారుమోగేలా చేస్తున్నాడు. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో అయితే ఇటీవలే ఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. సీనియర్ ఆటగాళ్ల తో పోటీగా  భారీగా పరుగులు చేస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్ట్ ల్లో కూడా ఏకంగా టి20 తరహా అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 98 బంతుల్లో 92 పరుగులు చేశాడు.


 ఇక శ్రేయస్ అయ్యర్ దూకుడు చూస్తే అలవోకగా సెంచరీ చేయగలడు అని అభిమానులు అనుకున్నారు. కానీ అంతలో ఊహించని రీతిలో వికెట్ చేజార్చుకుని చివరికి అభిమానులను నిరాశపరిచాడు ఈ ఓ ఆటగాడు. ఒకవైపు వికెట్లు మొత్తం పేకమేడల్లా కూలిపోతున్న ఎక్కడ ఒత్తిడికి లోను కాకుండా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు శ్రేయస్ అయ్యర్. యువ ఆటగాడి ఇన్నింగ్స్ పై ప్రస్తుతం అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. తొలిరోజు ఆట ముగిసే తర్వాత మీడియాతో మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ సెంచరీ మిస్ కావడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని మ్యాచ్ వీక్షిస్తూ ఉంటే ఎంతో ఉత్కంఠగా అనిపించింది. వెంటవెంటనే టీమిండియా  వికెట్లు కోల్పోయింది.


 ఆరంభం నుండి బంతి బాగా స్వింగ్ అవుతూ వస్తుంది. దీంతో పేసర్లకు పిచ్ బాగా అనుకూలిస్తుంది. డ్రెస్సింగ్ రూమ్ లో దూకుడుగా ఆడాలని ముందే చర్చించుకున్నాం ఇక దానికి అనుగుణంగానే ఆడేందుకు ప్రయత్నించాం. ఇక ప్రతి బంతిని డిఫెన్స్ చేస్తూ ఆడితే అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకున్నాను. దీంతో ధాటిగా ఆడటమే మేలు అని అనిపించింది. దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాను. అయితే సెంచరీ గురించి మాత్రం ఆలోచించలేదు. అంతేకాదు ఇక నేనే ప్రతిసారి స్ట్రైక్ లో ఉండాలి అని కూడా అనుకోలేదు. 80 పరుగులు పూర్తి చేసిన తర్వాత బుమ్రా డిఫెండింగ్ ఆడుతూ సహకారం అందించాడు. ఇక ఈ రోజు నాకు కలిసి రాలేదు అని అనుకున్నాను. స్వల్ప తేడాతో సెంచరీ చేజార్చుకున్నందుకు ఎలాంటి బాధ లేదు. అప్పుడప్పుడు ఆటలో ఇలాంటివి సహజమే అని చెప్పుకొచ్చాడు శ్రేయస్ అయ్యర్.

మరింత సమాచారం తెలుసుకోండి: