ఇటీవల కాలంలో రవిచంద్రన్ అశ్విన్ భారత క్రికెట్లో ఎంతో అద్భుతంగా రాణిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా జట్టులో ఎంతోమంది స్పిన్నర్లు ఉన్నప్పటికీ తన వైవిధ్యమైన స్పిన్ బౌలింగ్ తో మాత్రం ఎప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. ఇక జట్టుకు అవసరమైనప్పుడల్లా కూడా బాగా రాణిస్తూ వికెట్లు పడగోడుతూ ఇక జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ వస్తున్నాడు రవిచంద్రన్ అశ్విన్. తక్కువ అవకాశాలు వస్తున్నప్పటికీ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఎక్కడా మిగతా క్రికెటర్లకు తీసిపోకుండా అరుదైన రికార్డును బద్దలు కొడుతూనే ఉన్నాడు. ఇటీవలే టెస్ట్ లో 435 వికెట్ పడగొట్టి క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ రికార్డును సమం చేశాడు అనే విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో కూడా మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్.



 ఇటీవలే మూడో రోజు ఆట లో భాగంగా ఇంకా బ్యాటర్ ధనుంజయ డిసిల్వా ను అవుట్ చేయడంతో ఏకంగా టెస్టు ఫార్మాట్లో 440 వికెట్లు పడగొట్టాడు రవిచంద్రన్ అశ్విన్. తద్వారా సుదీర్ఘ ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జాబితాలో 8వ స్థానానికి ఎగబాకాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డెయిల్ స్టేయిన్  రికార్డును బద్దలు కొట్టాడు. డెయిల్ స్టేయిన్ 93 టెస్టుల్లో 439 వికెట్లు సాధిస్తే..  రవిచంద్రన్ అశ్విన్  86 టెస్టుల్లో 440 వికెట్లతో రికార్డులు తిరగరాశాడు. దీంతో రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ప్రతిభపై  ప్రస్తుత మాజీ క్రికెటర్లు అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



ఇకపోతే ఇటీవల శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో భాగంగా టీమిండియా ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక వరుసగా 15 టెస్ట్ సిరీస్ లలో విజయం సాధించిన జట్టుగా టీమిండియా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది అనే చెప్పాలి. ఇప్పటికే వన్డే టి20 ఫార్మాట్లో తనకు తిరుగు లేదు అని నిరూపించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ లో కూడా టీమిండియా ఘనవిజయం అందించి తన కెప్టెన్సీని తో ఇక అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: