మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.  బిసిసీఐ ముందుగా ప్రకటించినట్టుగానే మార్చి 26వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభించబడుతుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కువ వేదికలలో కాకుండా మహారాష్ట్ర లోని నాలుగు వేదికలలోనే మెగా టోర్ని నిర్వహించాలని సిద్ధమైంది బీసీసీఐ. ఇకపోతే ప్రస్తుతం ఇక అన్ని జట్లు కూడా ముంబై చేరుకుని ఇక అక్కడ క్యాంపులో  బయో బబుల్ లో ఉన్నాయి. ఇక విదేశీ ఆటగాళ్లు అందరూ కూడా ఐపీఎల్ జట్టుతో కలిసి పోయారు. అయితే ఇటీవలి కాలంలో కరోనా వైరస్ నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్ లను ఎంతో కఠిన నిబంధనల మధ్య నిర్వహిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇక ప్రతి మ్యాచ్లో కూడా ఆటగాళ్లను బయో మబ్బుల్లో క్వారంటైన్ కే పరిమితం చేసి ఒక హోటల్ గదిలోనే ఉంచుతూ ఉన్నారు. అయితే ఇలా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం ఒక హోటల్ గదికి మాత్రమే పరిమితం కావడం వల్ల ఎంతో మంది ఆటగాళ్లు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి బయో బబుల్ ఒత్తిడి కారణంగానే ఎంతోమంది అటు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే ఇక ఐపీఎల్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ బయో బబుల్ నుంచి తమ ఆటగాళ్లకు ఉపశమనం కలిగించేందుకు ఒక వినూత్నమైన ఆలోచన చేసింది.


 ఈ క్రమంలోనే కేవలం ఒక హోటల్ గదిలో మాత్రమే ఆటగాళ్లను బంది చేసినట్లు  ఉంచకుండా బయట ప్రపంచాన్ని ఎంజాయ్ చేసే విధంగా ప్రకృతిని ఆస్వాదించే విధంగా ఆలోచన చేసింది. 13 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఆటగాళ్లు సిబ్బందికి కుటుంబ సభ్యులతో సహా రిఫ్రెష్ కావడానికి  బయో సెక్యూర్ ఎం ఐ ఏరేనా ఏర్పాటు చేసింది . ఇక దీనిలో ఆటగాళ్లకు  కావాల్సిన అన్ని వసతులు ఉంటాయి. అంతేకాదు ఇక కుటుంబ సభ్యులు సేదతీరడానికి.. ఇక పిల్లలు ఆడుకోవడానికి కూడా సదుపాయాలు ఉండడం గమనార్హం. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl