ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో కీలక బౌలర్ గా కొనసాగుతున్నాడు హర్షల్ పటేల్. బెంగళూరు జట్టు లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. ఇక ఐపీఎల్ లో తన ప్రతిభను నిరూపించుకునీ అంతర్జాతీయ క్రికెట్ లో కూడా అవకాశాలు దక్కించుకున్నాడు అనే విషయం తెల్సిందే. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అద్భుత మైన బౌలింగ్ చేస్తూ వికెట్ పడగొట్టడంలో హర్షల్ పటేల్ సత్తా చాటుతున్నాడు అని చెప్పాలి. ఇక బెంగళూరు జట్టు విజయంలో కూడా కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు ఈ యువ బౌలర్. ఇకపోతే ఇటీవల బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ ప్రతిభపై టీమిండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవి శాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు.

 డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్ బౌలర్గా మారేందుకు హర్షల్ పటేల్ ప్రయత్నిస్తున్నాడు అంటూ రవి శాస్త్రి  చెప్పుకొచ్చాడు. కోల్కతా నైట్రైడర్స్ జట్టు లో ప్రమాదకర బ్యాట్ మెన్స్  అయినా  సామ్ బిల్డింగ్స్, ఆండ్రూ రస్సెల్ క్రీజులో ఉన్నప్పుడు కూడా హర్షల్ పటేల్ రెండు ఓవర్లు మెయిడిన్ వేయడం అనేది ఒక అద్భుతం అని చెప్పాలి. కోల్కతా జట్టు 128 పరుగులకే కుప్పకూలడంలో హసరంగా, ఆకాష్ దీప్ లతో పాటు అటు హర్షల్ పటేల్ కూడా ఎంతో కీలకపాత్ర వహించాడు అంటూ మాజీ కోచ్ రావిశాస్త్రి చెప్పుకొచ్చాడు.


 తాను భారత జట్టుకు కోచ్గా కొనసాగుతున్న సమయంలో హర్షల్ పటేల్ తో మాట్లాడాను. అతడికి తన బౌలింగ్ సత్తా ఏమిటో బాగా తెలుసు. అంతే కాదు అతని బౌలింగ్ పై  ఎంతగానో నమ్మకం ఉంచుతాడు. ఇక అతని గురించి అతనికి ఎంత నమ్మకం ఉంటుందో ఆండ్రూ రస్సెల్  లాంటి స్టార్ బ్యాట్స్ మెన్ క్రీజులో పెట్టుకొని మేడిన్ వేసి చూపించాడు హర్షల్ పటేల్. ఇక ఎవరికీ ఏ విధంగా బౌలింగ్ చేయాలి అని  ముందుగానే బ్రెయిన్ లో ప్లాన్ చేసుకుంటూ ఉంటాడూ హర్షల్ పటేల్. ఇటీవలి కాలంలో బౌలింగ్ యాక్షన్ లో కూడా ఎంతగానో పరిణితి కనిపించింది. డెత్ ఓవర్లలో మరింత నాణ్యమైన బౌలింగ్ చేస్తున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు రవిశాస్త్రి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl