కోల్కతా నైట్రైడర్స్ బ్యాట్స్మెన్ ఆండ్రూ రస్సెల్ పవర్ హీట్టింగ్ కి కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. కాస్త క్రీజ్లో కుదురుకున్నాడంటే చాలు విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడుతూ ఉంటాడు రస్సెల్.  ఇక ఇటీవల తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో మరోసారి ఆకట్టుకున్నాడూ అన్న విషయం తెలిసిందే. క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఏకంగా జట్టును విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లతో చెడుగుడు ఆడాడు. బంతి ఎలా ఉన్నా ఎటు నుంచి వచ్చిన బౌండరీకి తరలించి ముప్పుతిప్పలు పెట్టాడూ కేవలం 31 బంతుల్లో 2 ఫోర్లు 8 సిక్సర్ల సహాయంతో 70 పరుగులతో సునామీ సృష్టించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 138 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.3 ఓవర్లలోనే ఛేదించి కీలక పాత్ర వహించాడు. మరీ ముఖ్యంగా ఓడియన్ స్మిత్ వేసిన ఇన్నింగ్స్ 12 ఓవర్లలో రస్సెల్ విశ్వరూపం కనిపించింది అని చెప్పాలి.  3 సిక్స్ ల సాయంతో అలా ఫోర్ ఒక నోబెల్ మొత్తంగా ఇక 24 పరుగులు సాధించాడు. ఇక ఒక్కటే ఓవర్లో మరో బ్యాట్స్మెన్ సిక్సర్ కొట్టడంతో మొత్తంగా 30 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆండ్రూ రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ కు మరో ఎండ్ లో ఉన్న సామ్ బిల్లింగ్స్  పరుగులు చేసి మంచి సహకారం అందించాడు. ఈ  క్రమంలోనే మ్యాచ్ విజయం అనంతరం మాట్లాడిన సామ్ బిల్లింగ్స్ రస్సెల్ దినేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



రస్సెల్ విధ్వంసాన్ని దగ్గరుండి చూసాను.. ఒక విధ్వంసకర ఆటగాడు ఫాంలో ఉంటే ఇక మనం సపోర్ట్ చేయడం తప్ప ఇంకేం చేయలేము. పవర్ హీట్టింగులో అతడిని మించిన వారు లేరు అని రస్సెల్ మరోసారి నిరూపించాడు. కొన్ని కొన్ని సార్లు రస్సెల్ అసలు ఇదంతా చూసి అతనితో కలిసి ఆడాలంటే నాకు ప్రాణసంకటంగా అనిపిస్తూ ఉండేది. కానీ నాన్ స్ట్రైక్  లో ఉన్న నేను ఆండ్రూ రస్సెల్ ఇన్నింగ్స్ ను ఎంతగానో ఆస్వాదించాను. 51 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయినా సమయంలో రస్సెల్ ఒక మాట చెప్పాడు.  వికెట్లు పోయాయి అని కంగారు పడొద్దు పోరాడుదాం అంటు ఫలితం అనుకూలంగా వస్తుంది అంటు నాలో స్ఫూర్తి నింపాడు అంటూ సామ్ బిల్లింగ్స్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl