అంతర్జాతీయ క్రికెట్ లోకి అప్పుడప్పుడే ఎంట్రీ ఇస్తున్న ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఎంతో మంది స్టార్ క్రికెటర్లు స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా స్టార్ క్రికెటర్ల లాగే తాము కూడా అద్భుతంగా రాణించాలని భావిస్తూ క్రికెట్ ప్రొఫెషన్ లోకి అడుగు పెడుతూ ఉంటారు. ఇలా క్రికెట్లో రాణిస్తున్న సమయంలో తమ అభిమాన ఆటగాళ్ళ ని కాపీ కొట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఎంతో మంది యువ ఆటగాళ్లు. తమ అభిమాన ఆటగాళ్ళ లాగానే హావభావాలు పండిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఒక యువ ఆటగాడు విరాట్ కోహ్లీని అచ్చు గుద్దినట్లు కాపీ చేశాడు.


 విరాట్ కోహ్లీ భారీగా పరుగులు చేసి ప్రత్యర్థిపై పూర్తి ఆదిపత్యాన్ని సాధించిన సమయంలో ఎలా అయితే రియాక్ట్ అవుతాడో ఇక్కడ ఒక యువ ఆటగాడు కూడా అచ్చం అలాగే రియాక్ట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరో కాదు ప్రస్తుతం ఐపీఎల్లో యువ సంచలనం గా పేరు సంపాదించుకున్న ఆయుష్ బాదోని. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ యువ ఆటగాడు ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. లక్నో సాధించిన విజయాలలో తనవంతు పాత్ర పోషించాడు.

 అరంగేట్రం మ్యాచ్లోనే అర్థ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇకపోతే ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ లో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విజయానికి మూడు బంతుల్లో 1 పరుగు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆయుష్ బాదోని సిక్స్ కొట్టి లక్నో కీ విజయాన్ని అందించాడు అని చెప్పాలి. ఇక కోహ్లీ స్టైల్ లో విన్నింగ్ సెలబ్రేషన్ జరుపుకున్నాడు. ఇది కాస్త కెమెరాతో చిక్కడంతో ఈ వీడియో కాస్త వేగంగా మారిపోయింది. గతంలో చాలాసార్లు విరాట్ కోహ్లీ కూడా ఇదే విధంగా సెలబ్రేషన్స్ జరుపుకునేవాడూ. ఇప్పుడు ఈ మ్యాచ్లో మూడు బంతులు ఎదుర్కొన్న బాదోని 10 పరుగులు సాధించాడు. ఇక బర్త్ డే సెలబ్రేషన్ సంబంధించిన వీడియో కోహ్లీ అభిమానులను ఆకర్షిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: