ఐపీఎల్ వచ్చిందంటే చాలు ప్రేక్షకులు అందరికి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ ఫార్మాట్లో ప్రతి బ్యాట్స్ మెన్ కూడా అద్భుతంగా రాణిస్తూ ఉంటాడు. జట్టు విజయం కోసం కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే   అయితే జట్టుకు విజయాన్ని అందించడం ఒక ఎత్తయితే చివరి బంతికి సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించటం మరో ఎత్తు. ఇక ఇలా లాస్ట్ బంతికి సిక్సర్ కొట్టి విజయాన్ని అందించడంలో ఆ కిక్కే వేరుగా ఉంటుంది అని అంటూ ఉంటారు ప్రేక్షకులు. ఇలా చివరి బంతికి సిక్స్ కొట్టడం అటు ప్రేక్షకులకు కూడా తెగ నచ్చేస్తూ ఉంటుంది.


 ఇలా ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎంతోమంది చివరి బంతికి సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పాలి.. ఇలా ఎంతో మంది క్రికెటర్లు తమ అభిమానులందరికీ గుర్తుండిపోయే విధంగా సిక్సర్ తో మ్యాచ్ ముగించి చివరికి మరుపురాని విజయాన్ని అందించారు. ఇక ఆ వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. 2019 ఐపీఎల్ సీజన్ లో రోహిత్ శర్మ కోల్కతా నైట్రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లైవ్ చివరి బంతి సిక్స్ కొట్టి ఇక జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక 2011 సీజన్లో రోహిత్ శర్మ పూణే తో జరిగిన మ్యాచ్ లో సిక్సర్ తో ముగించి జట్టుకు విజయాన్ని అందించాడు.



 అంబటి రాయుడు కోల్కతా నైట్రైడర్స్ తో జరిగిన మ్యాచ్ 2011 ఐపీఎల్ సీజన్ లో సిక్సర్ తో మ్యాచ్ ముగించి జట్టును గెలిపించాడు. 2012లో రోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ లో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన సిక్స్ తో అదరగొట్టాడు. 2012 ఐపీఎల్ సీజన్ లో సోరబ్ తివారి పూణేతో జరిగిన మ్యాచ్లో చివరి బంతిని సిక్సర్ గా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక 2012 సీజన్లోనే బ్రావో కోల్కతాతో జరిగిన మ్యాచ్లో చివరి బంతి సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. మహేంద్ర సింగ్ ధోనీ 2016లో పంజాబ్తో జరిగిన మ్యాచ్ లో చివరి బంతిని సిక్సర్ కొట్టాడు  ఇక శాంట్నర్ రాజస్థాన్ తో 2019 సీజన్ లో జరిగిన మ్యాచ్లో సిక్సర్ తో మ్యాచ్ ముగించాడు. భరత్ 2021 సీజన్లో ఢిల్లీ కాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో.. రాహుల్ తేవాటియా  2022 లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో సిక్సర్లతో మ్యాచ్ ముగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: