అంబటి రాయుడు.. ప్రతిభ ఉన్న తెలుగు క్రికెటర్. అవకాశం వచ్చిన ప్రతిసారీ తనను తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఒకసారి మైదానంలోకి దిగాడు అంటే చాలు మెరుపు ఇన్నింగ్స్ తో జట్టుకు భారీ పరుగులు అందించడంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. కానీ ఇంత ప్రతిభ వున్న అంబటి రాయుడుకు మాత్రం ఎందుకో టీమిండియాలో అడపాదడపా అవకాశాలు దక్కాయి. తెలుగు క్రికెటర్ అని తొక్కేశారు అని కొంతమంది.. తమకు నచ్చిన వారికి అవకాశాలు ఇస్తారని మరికొంతమంది ఇలా అంబటి రాయుడు ని సెలెక్ట్ చేయకపోవడంపై ఎంతో మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు.

 సెలక్టర్ల  తీరుతో ఎన్నోసార్లు మనస్థాపం చెందిన అంబటి రాయుడు ఒక సారి ఏకంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించడం కూడా చేశాడు. ఇక ఆ తర్వాత అభిమానుల కోరిక మేరకు రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడు. ఈ 36 ఏళ్ల క్రికెటర్ ఇంకా టీమిండియాలో అవకాశం వస్తుందేమో అని తనని తాను ఎప్పుడూ నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఇక ఈ పాత గొడవలన్నీ పక్కనపెడితే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు అంబటి రాయుడు.



 ఎప్పుడూ తన బ్యాటింగ్తో మెస్మరైజ్ చేసే అంబటి రాయుడు ఇటీవల డివై పాటిల్  స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఎవరూ ఊహించని రీతిలో స్టనింగ్ క్యాచ్ తో అదరగొట్టాడు. ఇది అలాంటి ఇలాంటి క్యాచ్ కాదు ఏకంగా ఇప్పటివరకు ఐపీఎల్ లో ఉన్న అన్ని క్యాచ్ ల కంటే కాస్త తోపు క్యాచ్ చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి క్యాచ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనటంలో కూడా అతిశయోక్తి లేదు. రవీంద్ర జడేజా 16 ఓవర్ వేస్తున్న సమయంలో ఆకాష్ దీప్ జడేజా వేసిన నాలుగో బంతిని గాల్లోకి ఆడాడు  అయితే సిల్లీ మిడ్ ఆన్ లో ఫీల్డింగ్ చేస్తున్న రాయుడు కుడి చేతి వైపు డైవ్ చేసి గాల్లోనే ఒంటిచేత్తో  అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. 36 ఏళ్ళ వయసులో కూడా రాయుడు లో ఇంకా కసి తగ్గలేదు అంటూ అభిమానులు కామెంట్ చేస్తూ ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: