బీసీసీఐ పక్కా ప్లాన్ ప్రకారం ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభించింది. ఐపీఎల్ పై ప్రేక్షకుల్లో ఉన్న ఉత్కంఠను మరింత పెంచేందుకు  కొత్తగా రెండు జట్లను కూడా ఐపీఎల్ లోకి తీసుకు వచ్చింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించేందుకు కూడా నిర్ణయించింది. ఇక ఫిబ్రవరిలో మెగా వేలానికి వేయడానికి ఎన్నడూ లేనంత ప్రచారం జరిగింది. దీంతో ఈసారి  ఐపీఎల్ సూపర్ సక్సెస్ అవుతుందని ప్రతి ఒక్కరు భావించారు. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత మాత్రం లెక్కలు అన్నీ మారిపోయాయి. మ్యాచ్లను చూసేందుకు ప్రజలు ఎవరూ ఆసక్తి చూపకపోవడం గమనార్హం.


 ఐపీఎల్పై ప్రేక్షకులకు ఆసక్తి పోవడానికి చాలా కారణాలే ఉన్నాయి  మహారాష్ట్ర లోనే అన్ని మ్యాచ్ లు జరుగుతూ ఉన్నాయి. ఇక మరోవైపు ఐపీఎల్ లో టాప్ బ్రాండ్ వాల్యూ కలిగిన ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ సరిగ్గా రాణించడం లేదు. దీంతో మిగతా మ్యాచ్ లు చూసేందుకు ఎవరూ అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో  రోజురోజుకి ఐపీఎల్ రేటింగ్స్ దారుణంగా పడిపోతున్నాయి. మరోవైపు అటు పెద్ద సినిమాలు విడుదల కూడా ఐపీఎల్ కు ఊహించని షాక్ ఇస్తుంది అని చెప్పాలి.


 మొదటివారం ఐపీఎల్ రేటింగ్స్ పడిపోగా రెండవ వారం కూడా అలాగే కొనసాగుతూ వస్తోంది. టీవీలో ఓటిటీలో కూడా ఎక్కడ మ్యాచ్ చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడంలేదు ప్రేక్షకులు. అదే సమయంలో ఇక త్రిబుల్ ఆర్ లాంటి బ్లాక్బస్టర్ సినిమా విడుదల కావడంతో ఎంతో మంది ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీరారు. ఐపీఎల్ మ్యాచ్ లను పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు ఇప్పుడిప్పుడే త్రిబుల్ ఆర్ మేనియా తగ్గుతుంది అనుకుంటున్న సమయంలో కేజిఎఫ్ 2 సినిమా విడుదలైంది. దీంతో ఇప్పుడు థియేటర్లో శివతాండవం చేస్తున్న కేజీఎఫ్ 2 ను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. గత ఏడాదితో పోల్చి చూస్తే వ్యూవర్ షిప్ 14 శాతానికి పడిపోయినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: