సినిమాల ప్రభావం జనాల పై ఎంతగా పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సినిమాలు హీరోలు ఎలా చేస్తున్నారు అలా చేస్తూ నానా రచ్చ చెస్తున్నారు..అయితే కేవలం సినిమా దైలాగులు మాత్రమే, పాటలు, సీన్లు ఇలా ఒకటేమిటి ఎన్నో చేస్తున్నారంటూ కొందరు విష్లెషకులు అంటున్నారు. ఇక విషయాన్నికొస్తే..ఆస్త్రెలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెటర్ గా ఎంత పాపులర్ అయ్యాడో అంతకు మించి సినిమాల సూప్ ను చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. 



చాలా కాలం పాటు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి కెప్టెన్ గా వ్యవహరించడం వల్ల డేవిడ్ వార్నర్ కు బాగా దగ్గరయ్యారు. అందుకే అతని పేరుకు పరిచయం అక్కర్లేదు.క్రికెటర్ అయినప్పటికీ మనవాడే అన్నంతగా ఫ్యాన్స్ అతడిపై అభిమానం చూపారు.. ఇక వార్నర్ కు కూడా హైదరాబాద్ అంటే మహా ఇష్టం ఏర్పడింది.తెలుగు సినిమాలు,సౌత్ సినిమాలపై కూడా వార్నర్ మక్కువ పెంచుకున్నారు. తెలుగు మూవీస్, సౌత్ మూవీస్ కి సంబంధించిన వీడియోలతో వార్నర్ వరల్డ్ వైడ్ గా బాగా ఫెమస్ అయ్యాడు.. దాంతో క్రికెటర్ కూడా సోషల్ మీడియాలో బిజీ అయ్యారు.



అల వైకుంఠపురములో చిత్రంలో బుట్టబొమ్మ సాంగ్ స్టెప్పుల నుంచి అనేక చిత్రాల్లో ఫేమస్ డైలాగ్స్ చెబుతూ ఇంస్టాగ్రామ్ లో బాగా ఫెమస్ అయ్యారు. ఇప్పుడు మరో అద్భుతం చేశాడు. తాజాగా విడుదల అయ్యి ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన సినిమా కేజిఎఫ్ 2 చిత్రంలోని డైలాగ్స్ తో వార్నర్ అదరగొట్టాడు. యష్ చెబుతున్న డైలాగ్స్ కి లిప్ సింక్ ఇచ్చాడు.కేజిఎఫ్ లో బాగా ఫేమస్ అయిన 'వైలెన్స్ వైలెన్స్' అనే డైలాగ్స్ చెబుతున్నాడు.. అతని పేస్ ఎక్స్ప్రెషన్స్ ను చూస్తె యష్ కు పోటీ పడేలా ఉందని అందరు అభిప్రాయ పడుతున్నారు..ఇది ఇలా ఉండగా వీడియోను పోస్ట్ చేసిన కొద్ది గంటలకే మంచి వ్యుస్ ను అందుకుంది. మీరు అతని పెర్ఫార్మెన్స్ ను ఒకసారి చూడండి..



మరింత సమాచారం తెలుసుకోండి: