ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే ఛాంపియన్ జట్లు గా కొనసాగుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా అది ప్రేక్షకులందరికీ మోస్ట్ ఫేవరెట్ గానే మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వా నేనా అన్నట్లుగానే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఐపీఎల్లో స్టార్లుగా ఉన్న ఈ రెండు జట్లు చిరకాల ప్రత్యర్థులుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుని ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రతి మ్యాచ్లో తలపడుతూ ఉంటాయి ఈ రెండు జట్లు.


 కాగా ఈ దిగ్గజ జట్ల మధ్య నిన్న ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు జట్లు ఈ సారి పేలవా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉండడంతో ఈ ఛాంపియన్ జట్ల మధ్య మ్యాచ్ కూడా పస లేకుండానే ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ ప్రేక్షకులందరినీ కన్నార్పకుండా చేసింది. ఎంతో మంది ప్రేక్షకులను ఉత్కంఠతో మునివేళ్ళపై నిలబెట్టింది. ఇక చివరి బంతి వరకు ఎవరు విజయం సాధిస్తారో అనే విధం గా మారిపోయింది. నరాలు తెగే ఉత్కంఠత మధ్య జరిగిన ఈ పోరులో చివరికి చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది..


 మూడు వికెట్ల తేడాతో ముంబై పై విజయఢంకా మోగించింది చెన్నై సూపర్ కింగ్స్. రాబిన్ ఉతప్ప 30 అంబటి రాయుడు 40 పరుగులతో రాణించారు చివర్లో ధోని 19 బంతుల్లో 28 పరుగులతో తనదైన శైలిలో ఫినిషింగ్ ఇచ్చాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో రెండో విజయాన్ని నమోదు చేసింది చెన్నై. అయితే ఇప్పటి వరకు చెన్నై రెండో విజయాన్ని నమోదు చేస్తే అటు చాంపియన్ ముంబై ఇండియన్స్ మాత్రం ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. కనీసం చెన్నై తో జరిగిన మ్యాచ్ లో అయినా గెలిచి సత్తా చాటుతుంది అనుకుంటే ముంబై ఇండియన్స్ కి మళ్ళీ నిరాశే ఎదురైంది. దీంతో ఇక ముంబై ఇండియన్స్ కి ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యాయి అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl