ప్రస్తుతం టీమిండియా లో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు రవీంద్ర జడేజా. ఒకప్పుడు పేలవమైన పాము కారణంగా జట్టులో స్థానం కోల్పోయిన రవీంద్ర జడేజా ఇక ఈ సారి మాత్రం అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి నేనున్నాను అంటూ ధైర్యాన్ని కల్పిస్తూ జట్టును గట్టెక్కించాడు రవీంద్ర జడేజా. ఈ క్రమంలోనే ఇక రవీంద్ర జడేజా మూడు ఫార్మాట్లలో కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి.


 అయితే మొన్నటి వరకు స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగిన రవీంద్ర జడేజా ఇటీవల ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా మారిపోయాడు. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుని తన వారసుడిగా రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించాడు జడేజా. కెప్టెన్సీలో ఎందుకో చెన్నై సూపర్ కింగ్స్ బాగా రాణించడం లేదు. కాగా ఇటీవలే జడేజా కెప్టెన్సీ గురించి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదో ఒక రోజు టీమిండియాకు సారథ్యం వహించే సామర్థ్యం రవీంద్ర జడేజా లో ఉంది అంటూ అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.


 అయితే దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయడం అసాధ్యమని అంబటి రాయుడు తెలిపాడు. ధోని స్థానాన్ని మరొకరు భర్తీ చేయడం ఎప్పటికి జరగని పని. కానీ జడేజా ఎంతో సమర్ధుడు. ధోని మార్గనిర్దేశనం అతడు మైదానంలో ఉన్నంతవరకు జడేజాకు సారథ్యం సులువే. అతను మరింత మెరుగు అవుతాడు కూడా. చెన్నై ఒక్కటే కాదు ఏదో ఒకరోజు టీమిండియాకు కూడా సారథ్యం వహించగల సామర్ధ్యం రవీంద్ర జడేజా లో దాగి ఉంది. చెన్నై జట్టు సంధి దశలో ఉంది.. రానున్న రోజుల్లో చాలా మంది ఆటగాళ్లు చెన్నై జట్టు లో కొనసాగుతారు. జడేజా లాంటి యువ సారధి చెన్నైకి కలిగివుండటం సానుకూల అంశమే. జట్టు కోణంలో చూస్తే జడేజా సరైన దిశలో ప్రయత్నిస్తున్నాడు అంటూ అంబటి రాయుడు తెలిపాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: