ఐపీఎల్లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రస్తుతం ఊహించని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎప్పుడూ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండే చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి మాత్రం పేలవా ప్రదర్శన కారణంగా నిరాశ పరుస్తూనే ఉంది. ఇప్పటివరకు ఏకంగా ఎనిమిది మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి.  ఏ మ్యాచ్ లో కూడా కనీసం పోటీ ఇవ్వలేకపోతోంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.


 ఇలా వరుస విజయాలతో సతమతమౌతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కు అటు గాయాల బెడద కూడా వేధిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలు ఎంతో క్లిష్టంగానే మారిపోయాయ్ అని చెప్పాలి.  అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో   9వ స్థానంలో కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కు మరో బిగ్ షాక్ తగిలింది.. మిడిలార్డర్లో  రాణిస్తున్న అంబటి రాయుడు ఇప్పుడు గాయం కారణంగా జట్టు దూరం అయ్యాడు అనేది తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బాగా రాణించింది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అంబటి రాయుడు మాత్రమే అని చెప్పాలి.


 కష్టాల్లో ఉన్న ప్రతి సారి కూడా తన బ్యాటింగ్తో అదరగొట్టాడు. ఇలా ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించిన అంబటి రాయుడుకు ఇటీవల గాయం అయ్యింది. అయితే ఇటీవలే గాయంనే తో అతను బ్యాటింగ్ కొనసాగించాడని కానీ గాయం తీవ్రత మరింత ఎక్కువగా ఉందని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కోచ్ స్టిపెన్ ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు. మే 1వ తేదీన సన్రైజర్స్ తో జరగబోయే మ్యాచ్ కు అంబటి రాయుడు కోలుకుంటాడూ అన్న నమ్మకం కూడా లేదు అటు ఆయన చెప్పుకొచ్చారు. ఇక తదుపరి మ్యాచ్ లకు కూడా అంబటి రాయుడు అందుబాటులో ఉంటాడు అనే విషయంపై కూడా కచ్చితంగా చెప్పలేము అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో 129 స్ట్రైక్ రేటుతో  246 పరుగులు చేశారు అంబటి రాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl