ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని ప్రతి మ్యాచ్ కూడా ప్రస్తుతం ఎంతో రసవత్తరంగా సాగుతోంది . ప్లే ఆప్ కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచేందుకు ప్రతి జట్టు హోరాహోరీగా పోరాడుతుంది. దీంతో ఇక కొన్ని జట్లకు అయితే ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన సమయం కూడా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఐపీఎల్ పోరు మరింత ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా మారిపోయింది. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకపోవడంతో  అటు బిసిసిఐ ఎప్పటికప్పుడు అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే మొదట కేవలం 50 శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపిన బిసిసిఐ ఆ తర్వాత 100% ప్రేక్షకులను అనుమతిస్తూ  నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. దీంతో దాదాపు గత రెండేళ్ల నుంచి స్టేడియం లో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించడానికి దూరమైన ప్రేక్షకులు ప్రస్తుతం స్టేడియం కి తరలి వెళ్తున్నారు. ఇకపోతే అభిమానులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పింది బిసిసిఐ. 2022 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన ప్లే ఆఫ్ షెడ్యూల్ను ప్రకటించింది.


 కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో మే 24వ తేదీన క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ జరగబోతుందట. ఇక మే 25వ తేదీన కోల్కతాలోనే ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఒక రోజు విరామం తర్వాత మే 27వ తేదీన అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో క్వాలిఫైర్ 2 మ్యాచ్ జరగబోతుంది. ఇక మే 29వ తేదీన ఫైనల్ మ్యాచ్ నిర్వహించబోతుందట బీసీసీఐ. ఈ విషయాన్ని  అధికారికంగా ప్రకటించింది. అంతే కాదు ఇక ప్లేఆఫ్ దశ మ్యాచ్ లకు కూడా 100 శాతం మంది ప్రేక్షకులను అనుమతిస్తామని బీసీసీఐ తెలిపింది. ఈ క్రమంలోనే నేడు ఏ జట్టు కప్పు కొట్టుకుపోతుంది అన్నది కూడా ఆసక్తి కరంగానే మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl