ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా మారిపోయింది. ఇక ప్లే ఆప్ కి ఎవరు వెళ్తారు అన్నది కూడా ప్రేక్షకుల ఊహకందని విధంగానే ఉంది. మొన్నటివరకు పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగిన జట్లు ఇప్పుడు పరాజయాల పాలుఅవుతూ ఉంటే ఇక వరుస పరాజయాలతో సతమతమౌతున్న జట్లు ఇప్పుడు వరుస విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో అంతకంతకూ పైకి ఎగబాకుతూ ఉండడం గమనార్హం. దీంతో ఐపీఎల్ పోరు కాస్తా మరింత రసవత్తరంగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ప్రతి శని ఆదివారాల్లో ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 ఎందుకంటే వారంలో ఐదు రోజుల పాటు కేవలం సాయంత్రం ఏడున్నర గంటలకు మాత్రమే ఒక మ్యాచ్ వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. కానీ వారంతంలో ఐపీఎల్  అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ మరింత స్పెషల్ గా మార్చేందుకు కోసం ఇక రెండు మ్యాచ్లు నిర్వహిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ ముగుస్తుందో లేదో అంతలోనే మరో మ్యాచ్ కూడా ప్రారంభమవుతోంది. ఇలా క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా టీవీలకు అతుక్కుపోయేలా చేసేందుకు ప్రతి శని ఆదివారాల్లో రెండు మ్యాచ్ లు జరుగుతూ ఉంటాయి అనే చెప్పాలి.


 కాగా నేడు శనివారం కావడంతో డబుల్ ధమాకా నేపథ్యంలో రెండు మ్యాచ్లతో ప్రేక్షకులకు అదిరిపోయే క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందపోతుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. కాగా ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు మంచి ప్రదర్శన చేస్తూ పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. కానీ పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తుంది పంజాబ్ జట్టు మాత్రం ఏడవ స్థానంలో కొనసాగుతూ ఉండటం గమనార్హం. అదే సమయంలో సాయంత్రం ఏడున్నర గంటలకు లక్నో, కోల్కతా మధ్యమా జరగబోతుంది. కాగా ప్రస్తుతం లక్నో జట్టు రెండో ప్లేస్లో కొనసాగుతుండగా.. కోల్కతా జట్టు 8వ స్థానంలో కొనసాగుతోంది.  ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే కోల్కతా లక్నో పై తప్పక విజయం సాధించాలని ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl