ప్రస్తుతం ఐపీఎల్ పోరు ఎంతో రసవత్తరంగా సాగుతుంది. ప్లే ఆప్ కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క జట్టు కూడా హోరాహోరీగా పోరాడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే కొన్ని జట్లు మాత్రం పేలవ ప్రదర్శన చేస్తూ ఉంటే మరికొన్ని జట్లు మాత్రం అద్భుత విజయాలు సాధిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇకపోతే ఇటీవల శనివారం రోజున డబుల్ ధమాకా లో భాగంగా అటు సాయంత్రం ఏడున్నర గంటలకు లక్నో సూపర్ జెయింట్స్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ మొదట కాస్త ఆసక్తికరంగా జరుగుతుంది అనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం కోల్కతా బ్యాట్స్మెన్లు అందరూ చేతులెత్తేయడంతో ఇక విజయం ఒకవైపు అయిపోయింది.


 బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జట్టు 177 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే ఒక మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. దీంతో చివరికి 75 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. కోల్కతా నైట్రైడర్స్ బ్యాటింగ్ విభాగంలో ఒక్కరు కూడా ఆకట్టుకోలేకపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో వార్ వన్ సైడ్ అన్నట్లుగానే మొదటినుంచి విజయం లక్నో వైపు ఉంటూ వచ్చింది. అయితే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కోల్కతా నైట్రైడర్స్ జట్టు గెలవలేదు అందరూ భావించారు. చివరికి అలాంటి అద్భుతం ఏమీ జరగలేదు.


 ఇక జట్టు విజయం సాధించలేదు. అయితే లక్నో సూపర్ జెయింట్స్ కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మాత్రం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏకంగా కెప్టెన్ను మరో కెప్టెన్ అవుట్ చేశాడు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక్క బాల్ కూడా ఆడకుండానే వెనుదిరిగాడు అన్న విషయం తెలిసిందే.  స్ట్రైక్ లో ఉన్న క్వింటన్ డికాక్ అవసరమైన పరుగు కోసం ప్రయత్నించాడు. దీంతో నాన్ స్ట్రైక్ లో ఉన్న కేఎల్ రాహుల్ కూడా పరుగులు పెట్టాడు.  దీంతో కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డైరెక్ట్ త్రో విసరడంతో చివరికి వికెట్లకు తాకింది. దీంతో ఇక ఒక్క బంతి కూడా ఆడకుండానే లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ని కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పెవిలియన్ పంపించడంలో సక్సెస్ అయ్యాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: