సాధారణంగా టి20 క్రికెట్లో క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్  కూడా సిక్సర్లతో చేలరేగిపోవాలని అనుకుంటూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి బంతిని కూడా బౌండరీ తరలించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇలాంటి సమయంలోనే కొంతమంది పరుగులు చేయడంలో సక్సెస్ అయితే మరికొంతమంది మాత్రం వికెట్ చేజార్చుకుంటూ పెవిలియన్ చేరుతారు. అయితే మ్యాచ్ మొత్తం ఎలా సాగినప్పటికీ డెత్ ఓవర్లలో మాత్రం మ్యాచ్ స్వరూపం ఎలా ఉంటుంది అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. 16 నుంచి 20 వరకు బ్యాట్స్మెన్ చెలరేగి ఆడటం చేస్తూ ఉంటాడు.


 ఇక ప్రతి బంతిని సిక్సర్ కొట్టాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక ఇలా డెత్ ఓవర్లలో బ్యాట్మెన్స్ ను కంట్రోల్ చేయడం తక్కువ పరుగులకే కట్టడి చేయడం అటు బౌలర్లకు పెద్ద సవాల్తో కూడుకున్న పని అని చెప్పాలి. కానీ అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అనేది కూడా ఈ డేట్ ఓవర్లలోనే అందుతుంది. ఎందుకంటే బ్యాట్మెన్స్ రెచ్చిపోతూ వరుసగా సిక్సర్లు కొడుతూ ఉంటారు. ఓక్కసారి గణాంకాల్లోకి వెళ్లి చూస్తే 16 నుంచి 20 ఓవర్ల  మధ్యలో డెత్ ఓవర్లలో ఎక్కువ సిక్సర్లు బాదిన క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం.


 ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా సూపర్ ఫినిషర్ గా పేరు సంపాదించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని డెత్ ఓవర్లలో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు. ఏకంగా 171  సిక్సర్లతో మహేంద్రసింగ్ ధోని టాప్ లో కొనసాగుతున్నాడు. ఇక తర్వాత 144 సిక్సర్లతో  ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్ డెత్ ఓవర్లలో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రెండవ స్థానంలో ఉండడం గమనార్హం. ఇక ఆ తర్వాత 140 సిక్సర్లతో ఎబి డివిలియర్స్ మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. కోల్కత నైట్ రైడర్స్ ఆటగాడు ఆండ్రూ రస్సెల్ 92 సిక్సర్లతో 4వ స్థానంలో ఉన్నాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 90 సిక్సర్లతో ఐదవ స్థానంలో కొనసాగుతుండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: