ఈ ఏడాది ఐపీఎల్లో ఎంతో మంది యువ ఆటగాళ్లు తెరమీదకు వచ్చారు. ఎప్పటిలాగానే తమ ప్రతిభను చాటుకునీ టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్స్ మేమే అంటూ నిరూపించారు. అద్భుతమైన ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే మంచి ప్రదర్శన చేసి సరిపెట్టుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి మ్యాచ్లో కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మోసిన్ ఖాన్ సైతం అద్భుతంగా రాణించాడు అనే చెప్పాలి.


 ఈ ఏడాది ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో జట్టు విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. ఒకప్పుడు కె.ఎల్.రాహుల్  కు కెప్టెన్సీ చేతకాదు అని విమర్శించిన వాళ్ళ నోళ్ళు మూయిస్తూ లక్నో జట్టును విజయపథంలో ముందుకు నడిపిస్తున్నాడు కేఎల్ రాహుల్. ఇక ఇప్పుడు పాయింట్స్ టేబుల్ లో టాపర్ గా కొనసాగుతుంది లక్నో జట్టు. అయితే లక్నో జట్టు తరఫున ఎంతమంది యువ ఆటగాళ్లు  కూడా అదరగొడుతున్నారు అని చెప్పాలి.  ఈక్రమంలోనే మోసిన్ ఖాన్ అనే యువ బౌలర్ కి ఆలస్యంగానే అవకాశం దక్కింది. కానీ వచ్చిన అవకాశాన్ని ఎంతో అద్భుతంగా వినియోగించుకున్నాడు సదరు బౌలర్.


 మోసిన్ ఖాన్ ఆడిన చివరి ఐదు మ్యాచ్ లలో అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు అని చెప్పాలి. 5 మ్యాచ్ లలో 10 వికెట్లు తీయడంతో పాటు ఒక్క మ్యాచ్లో కూడా 27 పరుగుల కంటే ఎక్కువ రన్స్ ఇవ్వలేదు అని చెప్పాలి. అంతేకాదు రెండు మెయిడిన్ ఓవర్లు కూడా వేయడం గమనార్హం. ఇక ఒక మ్యాచ్ లో అయితే 3 ఓవర్లలో కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక ఆరంభంలోనే వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును కష్టాల్లో పడేస్తున్నాడు మోసిన్ ఖాన్.  అతని ప్రతిభతో అటు లక్నో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl