ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా టేబుల్ టాపర్ గా కొనసాగుతున్న లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానంలో కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని అటు ప్రేక్షకులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి మరి వీక్షించారు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్ విభాగం విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ క్రమంలోనే 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు బ్యాటింగ్ విభాగం మొత్తం కుప్పకూలిపోయింది అని చెప్పాలి.



 కనీస ప్రదర్శన చేయలేక ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ధాటికి 82 పరుగులకే ఆలౌట్ అయింది లక్నో సూపర్ జెయింట్స్ జట్టు. దీంతో భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది గుజరాత్ టైటాన్స్ జట్టు. అంతేకాకుండా ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన మొట్టమొదటి జట్టుగా కూడా రికార్డు సృష్టించింది అనే చెప్పాలి. ఇక అరంగేట్రం మ్యాచ్లోనే అద్భుతంగా రాణించడంతో ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించడంపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 మా జట్టును చూస్తూ ఉంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. మరో రెండు మ్యాచ్ లు మిగిలి వుండగానే ప్లే ఆప్ కి వెళ్లడం ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపాడు. ముంబై తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత ప్రతి మ్యాచ్లో ఎంతోకొంత పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలని జట్టులో ఉన్న ఆటగాళ్లతో చెప్పాను. ఈ క్రమంలోని లక్నో సూపర్జెంట్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రమే కాదు ఇకనుంచి ఆడే అన్ని మ్యాచ్లో కూడా దయ చూపించకుండా బౌలర్లపై విరుచుకుపడి ఆడాలని తమ జట్టు కి సూచించాను అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: