సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు తెర మీదికి వచ్చి ఒక వెలుగు వెలిగినా  తర్వాత కనుమరుగు అవుతూ ఉంటారు అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు అటు క్రికెట్ లో కూడా ఇలాంటి ఆటగాళ్లు ఎంతోమంది ఉంటారు అని చెప్పాలి. ఒక్కసారిగా తమ ప్రతిభతో వెలుగులోకి వచ్చిన తర్వాత అవకాశాలు రాక ప్రవర్తన సరిగా లేక ప్రతిభను నిరూపించుకోలేక కనుమరుగు అవుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రికెటర్లలో ఒకరు హెర్షెల్ గిబ్స్. ఇతని పేరు దాదాపు క్రికెట్ ప్రేక్షకులకు తెలుసు.


 ఎందుకంటే దక్షిణాఫ్రికా జట్టు తరపున ప్రాతినిధ్యం వహించిన హెర్షెల్ గిబ్స్ అంతర్జాతీయ  క్రికెట్లో ఎన్నో అద్భుతమైన రికార్డు నెలకొల్పాడు. ఇక ఈ ఆటగాడు తన అద్భుతమైన బ్యాటింగ్తో ప్రత్యర్థులపై విరుచుకుపడే తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉండేది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆరు బంతులలో ఆరు సిక్సర్లు కొట్టిన మొదటి బ్యాట్స్మెన్గా కూడా రికార్డులు సృష్టించాడు అని చెప్పాలి. ఇలా తన ఆటతీరుతో అప్పట్లో ప్రపంచ క్రికెట్లో ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయాడు. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం తన వింత చేష్టలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉండేవాడు.


 ప్రపంచ క్రికెట్లో మంచి ప్రతిభ వున్న ఆటగాడిగా గుర్తింపు సంపాదించుకున్న సమయంలోనే హోటల్ గదిలో గంజాయి తాగుతూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. దీంతో అతడు ఆరు నెలల నిషేధం ఎదుర్కోవలసి వచ్చింది. సరిగ్గా ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈ ఘటన జరిగింది. 2001లో దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఉంది. మే 11,  2001 న అంటిగువాలో  హెర్షెల్ గిబ్స్ తో పాటు మరో నలుగురు ఆటగాళ్లు హోటల్ గదిలో గంజాయి తాగుతూ పట్టుబడ్డారు.  ఈ క్రమంలోనే ఆటగాళ్లకు భారీ జరిమానా విధించడంతో పాటు ఆరు నెలల నిషేధం విధించింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు. 2005లో ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో కూడా మద్యం సేవించి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఇలాంటివన్నీ కూడా హెర్షెల్ గిబ్స్ కెరీర్ను ఎంతగానో నాశనం చేశాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: