ఐపీఎల్ సీజన్ 15 చివరి దశకు చేరుకుంది. ఇక లీగ్ స్టేజ్ లో కొన్ని మ్యాచ్ లు మినహా ప్లే ఆప్స్ సమరానికి అంత సిద్దమవుతోంది. ఇప్పుడు అందరి దృష్టి ప్లే ఆప్స్ కు చేరుకునే ఆ నాలుగు జట్లు ఏవి అనే విషయంపై ఊగిసలాడుతున్నాయి. కానీ నిన్న జరిగిన మ్యాచ్ తో అధికారికంగా హార్దిక్ పాండ్య నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు లక్నో ను ఓడించడం ద్వారా ప్లే ఆప్స్ కు చేరుకున్న మొదటి టీమ్ గా రికార్డు సృష్టించింది. వీరి ప్రదర్శనతో ఆజట్టు యాజమాన్యం ఫుల్ ఖుషీగా ఉంది. ఇక మిగిలిన మూడు జట్లు ఏవో అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

అందులో భాగంగా ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్యన మ్యాచ్ జరుగుతోంది. ఇందులో ఖచ్చితంగా ఢిల్లీ గెలిస్తేనే ప్లే ఆప్స్ పై ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడిందా... ఇక ఇంటికే. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా జట్టు రిషబ్ పంత్ తన టీమ్ ను నడిపిస్తాడు అన్నది తెలియాల్సి ఉంది. మొదట టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో జొస్ బట్లర్ విఫలం కాగా, వన్ డౌన్ లో శాంసన్ రాకుండా అందరినీ ఆశ్చర్యపరుస్తూ అశ్విన్ ను పంపించాడు. ఇచ్చిన అవకాశాన్ని వాడుకున్న అశ్విన్ అర్ద సెంచరీని సాధించాడు.

ఇక ఈ మ్యాచ్ లో ఢిల్లీ కేవలం గెలవడం పైనే కాదు.. రన్ రేట్ ను కూడా సాధించడం మీద దృష్టి పెడితే ప్లే ఆప్స్ లో  ఉపయోగంగా ఉంటుంది. మరి రిషబ్ పంత్ తన టీమ్ ను గెలుపు వైపు నడిపించి ప్లే ఆప్స్ కు చేరువ చేయగలడా అన్నది తెలియాలంటే ఇంకో కాస్త సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: