బుల్లెట్ లాంటి బంతులతో బ్యాట్మెన్స్ వెన్నులో వణుకు పుట్టించే విధంగా ప్రస్తుతం ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేస్తున్నాడు. 150 కిలోమీటర్ల కు పైగా వేగంతో బంతులు సందించటమే కాదు ఇక బంతులకు కాస్త టెక్నిక్ కూడా జోడిస్తూ తనకు తిరుగు లేదు అని నిరూపిస్తున్నాడు ఉమ్రాన్ మాలిక్. ఈ క్రమంలో అతని ప్రతిభకు ప్రస్తుతం మాజీ క్రికెటర్లు అందరూ కూడా ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారూ. అతడు టీమిండియాకు భవిష్యత్తు ఆశాకిరణం అంటూ ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతను వెంటనే టీమిండియా లోకి తీసుకోవాలి అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం.
ఈ క్రమంలోనే ఉమ్రాన్ మాలిక్ త్వరలోనే భారత జట్టు తరఫున ఆడుతాడు అని సన్రైజర్స్ హైదరాబాద్ కోచ్ డెయిల్ స్టెయిన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఉమ్రాన్ మాలిక్ వేసే బంతుల్లో 90% బంతులు 142 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయి. ప్రతిసారి ఫేస్ కోసం చూస్తాడు. అందుకే అతనికి ఎంతో సులభంగా వికెట్లు కూడా దక్కుతున్నాయి. అతడిని టీమిండియా ఎలా ఉపయోగించుకుంటుంది వాళ్ళ ఇష్టం. కానీ ఉమ్రాన్ మాలిక్ మాత్రం అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు ఎంతో సమర్ధుడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే ఆటగాడిని ప్రతి జట్టు కోరుకుంటుంది అంటూ డెయిల్ స్టెయిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.