సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు లో ప్రస్తుతం మెరుపువేగంతో బంతులను విసురుతూ స్పీడ్ గన్ గా పేరు సంపాదించుకున్నాడు ఉమ్రాన్ మాలిక్.  వసతులు తక్కువగా ఉండే జమ్మూకాశ్మీర్లో నుండి గొప్ప క్రికెటర్గా ఎదిగాడు అనే చెప్పాలి. కొంతమంది బౌలర్లకు మాత్రమే సాధ్యమైన 150 కిలోమీటర్ల వేగంతో బంతుల్లో విసరడం లాంటిది ఎంతో అలవోకగా సాధిస్తూ ఉన్నాడు.  ప్రతి మ్యాచ్లో కూడా మెరుపువేగంతో బాధితులను విసురుతూ రికార్డు కొడుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే అతని స్పీడ్ బౌలింగ్ చూసి ప్రస్తుతం ప్రతి ఒక్కరు అవాక్కవుతున్న పరిస్థితి ఏర్పడింది.


 బుల్లెట్ లాంటి బంతులతో బ్యాట్మెన్స్  వెన్నులో వణుకు పుట్టించే విధంగా ప్రస్తుతం ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేస్తున్నాడు. 150 కిలోమీటర్ల కు పైగా వేగంతో బంతులు సందించటమే కాదు ఇక బంతులకు కాస్త టెక్నిక్ కూడా జోడిస్తూ తనకు తిరుగు లేదు అని నిరూపిస్తున్నాడు ఉమ్రాన్ మాలిక్. ఈ క్రమంలో అతని ప్రతిభకు ప్రస్తుతం మాజీ క్రికెటర్లు అందరూ కూడా ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారూ. అతడు టీమిండియాకు భవిష్యత్తు ఆశాకిరణం అంటూ ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతను వెంటనే టీమిండియా లోకి తీసుకోవాలి అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం.



 ఈ క్రమంలోనే ఉమ్రాన్ మాలిక్ త్వరలోనే భారత జట్టు తరఫున ఆడుతాడు అని సన్రైజర్స్ హైదరాబాద్ కోచ్ డెయిల్ స్టెయిన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఉమ్రాన్ మాలిక్ వేసే బంతుల్లో 90% బంతులు 142 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయి. ప్రతిసారి ఫేస్ కోసం చూస్తాడు. అందుకే అతనికి ఎంతో సులభంగా వికెట్లు కూడా దక్కుతున్నాయి. అతడిని టీమిండియా ఎలా ఉపయోగించుకుంటుంది వాళ్ళ ఇష్టం. కానీ ఉమ్రాన్ మాలిక్  మాత్రం అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు ఎంతో సమర్ధుడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే ఆటగాడిని ప్రతి జట్టు కోరుకుంటుంది అంటూ డెయిల్ స్టెయిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: