ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు శ్రీలంక క్రికెటర్ మహీష్ తీక్షణ.  చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు నాలుగు విజయాలు సాధించగా.. ఈ నాలుగు విజయాలలో కూడా తనవంతు పాత్ర పోషించాడు. పవర్ ప్లే ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు అనే చెప్పాలి. మొదటి సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న మహీష్ తీక్షణ 11 మ్యాచ్లలో 12 వికెట్లు పడగొట్టాడు. క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా మహీష్ తీక్షణ మరింత దగ్గరయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల చెన్నై జట్టు లోకి రాకముందు తన కెరియర్ ఎలా ఉందో మహీష్ తీక్షణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.


 ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ యజమాన్యం ఒక వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే శ్రీలంక క్రికెటర్ మహీష్ తీక్షణ తాను అండర్ నైన్ టీన్ జట్టులో ఉన్న సమయంలో పడిన ఇబ్బందులను గుర్తుచేసుకున్నాడు. అండర్ నైన్ టీన్ క్రికెట్ జట్టుకు ఆడే సమయంలో 107 కేజీల బరువు ఉండేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. కానీ అంత బరువు తో ఇక క్రికెట్లో కొనసాగడం కష్టమని తెలుసుకున్న తర్వాత బరువు తగ్గడానికి ఎంతో కష్టపడ్డాను అంటూ మహీష్ తీక్షణ చెప్పుకొచ్చాడు. ఇక యో యో టెస్టు సమయంలో నా చర్మం ముడతలు పడి పోయేది. 2020లో పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాను.


 మళ్లీ బరువు పెరగకుండా ఉండేందుకు ఎంతో కష్టపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు ఈ శ్రీలంక క్రికెటర్. 2021లో శ్రీలంక తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. దక్షిణాఫ్రికాతో వన్డే మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది అంటూ తెలిపాడు. మిస్టరీ స్పిన్నర్ గా గుర్తింపు సంపాదించుకున్న అజింతా మొండిస్ మూడేళ్ల నుంచి నాకు కోచింగ్ ఇస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు  2022 లో మహేంద్ర సింగ్ ధోనీ తో మాట్లాడాను. అయితే మెగా వేలంలో చెన్నై జట్టు తీసుకుంటుందని మాత్రం కలలో కూడా ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Csk