సరిగ్గా ఐపీఎల్ సీజన్ ముందు వరకూ కూడ పేలవ ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు భారత స్పిన్నర్  చాహల్. అతనికి టీమిండియాలో చోటు ఇవ్వడమే వృధా అంటూ ఎంతో మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు అదే ఆటగాడు తన అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు అని చెప్పాలి. గత ఏడాది వరకు బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యుజ్వేంద్ర చాహల్ ఇక ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ జట్టులో కొనసాగుతున్నాడు. తన అద్భుతమైన ఫామ్ తో కీలక సమయంలో వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల రాజస్థాన్ రాయల్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 161 పరుగులు చేయగా ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్  జట్టు 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని సాధించడం గమనార్హం.  ఈ మ్యాచ్ లో అటు రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినప్పటికీ ఆ జట్టు ఓపెనర్ చాహల్ మాత్రం ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి.


 ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీ లో ఒక సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్గా యుజ్వేంద్ర చాహల్ నిలిచాడు.  కాగా ఇప్పటివరకు ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 12 మ్యాచ్ లు ఆడిన చాహల్ ఇరవై మూడు వికెట్లు తీశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ తరఫున ఈ సీజన్లో ఇదే అత్యుత్తమ కావడం గమనార్హం. ఇక ఈ లిస్టులో తొలిస్థానంలో జేమ్స్ ఫాల్కనర్ ఉన్నాడు. 2013 లో ఫాల్కనర్ 28 వికెట్లతో అదరగొట్టాడు అని చెప్పాలి. లీగ్ దశలో రాజస్థాన్ కు మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో  చాహల్ ఫామ్ చూస్తే ఫాల్కనర్ రికార్డు అధిగమించే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు అభిమానులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl