బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ముగింపు వేడుకలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఘనంగా జరిగే ఈ వేడుకలను చూడటానికి అటు ప్రేక్షకులు తెగ ఇష్టపడుతూ ఉంటారు. కానీ గత రెండేళ్ల నుంచి మాత్రం కరోనా వైరస్ కారణంగా ఇలాంటి వేడుకలు  కనిపించడం లేదనే చెప్పాలి. కానీ ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో ఎంతో ఘనంగా వేడుకలను నిర్వహిం చాలని ప్లాన్ చేస్తోంది బీసీసీఐ.


 ఈ క్రమం లోనే ఆస్కార్ విజేత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ తో పాటు ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది అని తెలుస్తూ ఉంది. కాగా ఐపీఎల్ గవర్నింగ్ బాడీ తో కలిసి ఏర్పాట్లు కూడా మొదలు పెట్టింది అని తెలుస్తుంది. మే 29వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ ప్రారంభానికి 45 నిమిషాల ముందు ఇక ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అయితే ఈ ముగింపు వేడుకల్లో భాగంగా మరో కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోందట.


 ఇన్నాళ్ల పాటు హిస్టరీలో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించిన వారందరినీ కూడా ప్రత్యేక కార్యక్రమానికి పిలిచి ఘనంగా సత్కరించాలి అని భావిస్తోందట టీమిండియా. అయితే ఇక భారతదేశంలో భారత క్రికెట్ ప్రస్థానానికి సంబంధించి ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ  రూపొందించేందుకు  ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఇప్పటికే గుజరాత్ ప్లే ఆఫ్ స్థాన్నాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం లక్నో రాజస్థాన్ ఆర్సిబి ఢిల్లీ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య పోటీ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl