ఐపీఎల్ సీజన్ 15 లో ఈ రోజు మ్యాచ్ ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్యన ఇంకాస్త సేపట్లో స్టార్ట్ కానుంది. అయితే ఇకపై జరగనున్న అన్ని మ్యాచ్ లు కూడా ప్లే ఆప్స్ కు చేరుకునే జట్లకు చాలా ముఖ్యం అని చెప్పాలి. ఒక జట్టు గెలుపు ఓటములు వేరే జట్లకు ప్లస్ అవ్వొచ్చు.. అలాగే మైనస్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చూస్తే కేవలం ఒక్క గుజరాత్ టైటాన్స్ మాత్రమే అధికారికంగా ప్లే ఆప్స్ లోకి అడుగు పెట్టింది. ఇంకా మూడు స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు అందరి లోనూ అదే చర్చ జరుగుతోంది.

అయితే పాయింట్ల పట్టిక ప్రకారం చూస్తే, మూడు స్థానాలను ఏ జట్లు ఆక్రమించుకుంటాయి అన్నదానికి క్రికెట్ ప్రముఖులు కొన్ని విశ్లేషణలు ఏ విధంగా ఉన్నాయన్నది చూద్దాం.

లక్నో సూపర్ జాయింట్స్

2022 ఐపీఎల్ లో కొత్తగా వచ్చిన రెండు జట్లలో లక్నో సూపర్ జయింట్స్ ఒకటి. ఈ జట్టుకు కెప్టెన్ గా పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ కె ఎల్ రాహుల్ వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతమ్ ఈ జట్టు 12 మ్యాచ్ లను పూర్తి చేసుకుంది. అందులో 8 మ్యాచ్ లలో గెలిచి మొత్తం 16 పాయింట్ లతో రెండవ స్థానంలో ఉంది. ఇప్పుడున్న ఫామ్ లో ఇక ఆడబోయే రెండు మ్యాచ్ లలో ఒకటి గెలిస్తే ప్లే ఆప్స్ కు చేరుకుంటుంది.

రాజస్థాన్ రాయల్స్

ఈ జట్టును సంజు శాంసన్ సమర్థవంతంగానే నడిపిస్తున్నాడు. ఇప్పటికి రాయల్స్ 12 మ్యాచ్ లను పూర్తి చేసుకుంది. అయితే కేవలం 7 మ్యాచ్ లలో మాత్రమే గెలిచి ఇంకా మిగిలిన రెండు మ్యాచ్ లను గెలిస్తేనే ప్లే ఆప్స్ కు చేరగలదు. అయితే ఖచ్చితంగా ఈ జట్టు కూడా ప్లే ఆప్స్ కు చేరుకుంటుందని అందరూ భావిస్తున్నారు.

వాస్తవంగా చూస్తే ప్లే ఆప్స్ కు చేరుకోవడానికి ఇంకా రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ కు కొంచెం అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. అయితే మిగిలిన మ్యాచ్ లు అన్నిటిలోనూ గెలిస్తేనే చేరగలవు. మరి చివరికి ఈ సమీకరణాలు ఎవరిని ప్లే ఆప్స్ కు చేరుస్తాయి అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: