సాధారణంగా ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎంతో మంది ఆటగాళ్లు తప్పులు చేయడం చూస్తూ ఉంటారూ. కానీ ఈ ఏడాది మాత్రం ఎందుకొ కేవలం ఆటగాళ్లేనా మేము కూడా తప్పులు చేస్తాం అనుకున్నారో ఏమో ఆటగాళ్ల కంటే ఎక్కువగా అంపైర్లు  తప్పులు చేస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఫీల్డ్ అంపైర్ నుంచి థర్డ్ అంపైర్  వరకు తప్పుడు నిర్ణయాలతో ఎంతో మంది ఆటగాళ్లను బలి చేస్తున్నారు. అంతే కాకుండా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ఉన్నారు. ఇలా ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కీలకమైన ఆటగాళ్ల విషయంలో అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుని అవుట్ గా ప్రకటించడం వివాదం గానే మారిపోయింది అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో అవుట్ ఇవ్వడంలో అంపైర్ కన్ఫ్యూషన్ లో మునిగిపోయాడు.  ఎంతో ఆసక్తి కరంగా జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే.  ఈ మ్యాచ్లో భాగంగా ముంబై ఇన్నింగ్స్ సమయంలో ఆరో ఓవర్ సమర్జీత్ ఇన్ స్వింగర్ సంధించాడు.  ఈ క్రమంలోనే బ్యాట్స్మెన్ ఏడ్జ్ దాటుతూ కీపర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే బ్యాట్ కీ తాకిన శబ్దం వినిపించడంతో ధోని పెద్దగా అప్పీల్ చేశాడు.


 అయితే ఫీల్డ్ అంపైర్ డైలమాలో మునిగిపోయాడు. అది వైడ్ అంటూ సిగ్నల్ ఇవ్వబోతు వెంటనే తన యాంగిల్ మార్చుకుని అవుట్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఇది చూసిన తర్వాత ధోని లాంటి క్రికెటర్ ఆపిల్ చేసిన తర్వాత ఏ అంపైర్  అయినా సరే ఆలోచనలో పడి పోవాల్సిందే అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్లో 97 పరుగులకే చెన్నై సూపర్ కింగ్స్ కుప్పకూలిపోగా.. ఇక స్వల్ప లక్ష్యాన్ని 14.5 ఓవర్లో ముంబై ఇండియన్స్ ఛేదించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl