ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఎంతో మంది యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు అయితే ఇలా ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ లో యువ ఆటగాళ్లు ప్రతిభ చాటడం  చేస్తూనే  ఉంటారు.  కానీ ఈ ఏడాది మాత్రం మొన్నటి వరకు సీనియర్ ఆటగాళ్లుగా ముద్ర పడి ఫామ్ కోల్పోయి టీమిండియా కు దూరమైన ఎంతోమంది ఆటగాళ్లు మునుపటి ఫామ్ లోకి వచ్చి విజృంభిస్తున్న తీరు అభిమానులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకప్పుడు కోల్కతా జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగిన దినేష్ కార్తీక్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు.


 కానీ ఈ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతి మ్యాచ్లో కూడా తనదైన ఫినిషింగ్ టచ్ ఇస్తూ ఉన్నాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ జట్టు విజయానికి తోడ్పాటు అందిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే అతని ఆటతీరు చూసిన తర్వాత అందరూ అవాక్కవుతున్నారు. అతన్ని మళ్ళీ టీమిండియా లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో రాహుల్ తేవాటియా సైతం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సిక్సర్లు ఫోర్లు వర్షం కురిపిస్తున్నాడు అని చెప్పాలి. ఫినిషెర్ గా అందరిని ఆకట్టుకున్నాడు.


 ఇక హార్దిక్ పాండ్యా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు పేలవమైన ఫామ్ తో విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా ఈ ఏడాది మాత్రం కెప్టెన్గా ఆటగాడిగా కూడా సక్సెస్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురికి టీమ్ ఇండియాలో అవకాశం ఇవ్వాలి అంటూ టీమిండియా సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ కోరాడు. వచ్చేనెలలో సౌతాఫ్రికాతో టీమిండియా ఆడబోయే టీ20 సిరీస్ కోసం ఈ ముగ్గురిని ఎంపిక చేయాలని కోరాడు.  నేనైతే హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రాహుల్ తేవాటియా లను ఫిషర్ లుగా ఎంచుకుంటాను. వరల్డ్ కప్ కు చాలా సమయం ఉంది. ఈ లోపు వీళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది అంటూ ఎమ్ ఎస్ కె  ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Msk