ఏడాది పేలవ ప్రదర్శనతో తీవ్రస్థాయిలో నిరాశపరిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులందరినీ కూడా నిరాశలో ముంచెత్తింది. మొన్నటికి మొన్న ధోనీ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత మాత్రం అందరిలో సరికొత్త ఆశలు రేకెత్తించింది అన్న విషయం తెలిసిందే. వరుస విజయాలు సాధించడంతో ఇక ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇటీవలే   ముంబై తో జరిగిన మ్యాచ్ లో ఘోరమైన ప్రదర్శన చేసింది చెన్నై జట్టు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విభాగం మొత్తం పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పాలి.


 చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా  కనీస పరుగులు చేయకుండా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లు ఆడకుండానే 16 ఓవర్లకు 97 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కాగా ఈ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కడే నిలకడగా రాణించాడు.  33 బంతుల్లో 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ 34 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు.


 ఇకపోతే ఇటీవల ముంబైలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ఓటమి చవి చూసినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మాత్రం ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోని ఇన్నింగ్స్ టాప్ స్కోరర్గా నిలవగా.. 21సార్లు సీఎస్కే తరఫున ఇలా టాప్ స్కోరర్గా ఎక్కువసార్లు నిలిచిన మూడవ ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు. అంతకుముందు సురేష్ రైనా 33 ఇన్నింగ్స్ లో డుప్లేసెస్ 26 ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచారూ. ధోని 21 ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్గా నిలవడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: