ఇటీవలే రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత చెన్నై జట్టు ఆడిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా కనిపించ లేదు. దీంతో రవీంద్ర జడేజా కు చెన్నై యాజమాన్యానికి మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ ఎన్నో వార్తలు హాట్ టాపిక్ గా మారి పోయాయ్. గాయం కారణం గా జడేజా దూరమయ్యాడు అని చెప్పినా ఇక ఇలాంటి వార్తలు మాత్రం ఆగలేదు అనే చెప్పాలి. ఇటీవలే రవీంద్ర జడేజా గురించి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను భర్తీ చేయడం ఎంతో కష్టం అంటూ చెప్పుకొచ్చాడు మహేంద్రసింగ్ ధోని.


 అతడికి ఎవరూ సాటి లేరు అంటూ చెప్పుకొచ్చాడు. జడేజాను మిస్ అవుతున్నారా అని అడిగిన ప్రశ్నకు ధోని సమాధానమిస్తూ.. రవీంద్ర జడేజా లాంటి  ఆటగాడు తమకు ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా ఉపయోగ పడతాడు అని చెప్పుకొచ్చాడు.  ఫీల్డింగ్ లోనూ అతడిని ఎవరూ భర్తీ చేయలేరని తెలిపాడు.  ఇక ముంబై తో మ్యాచ్లో ఓటమి పాలవడం పై స్పందిస్తూ టీ20ల్లో 130 కంటే తక్కువ స్కోరు ను కాపాడు కోవడం కష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో బౌలర్లకు ఒకటే చెప్పాను ఫలితం గురించి ఆలోచించకుండా కట్టు దిట్టంగా బంతులు వేయమని చెప్పాను.


 ముఖేష్ చౌదరి సమర్జీత్ సింగ్ లాంటి యువ బౌలర్లు  చాలా గొప్పగా బౌలింగ్ చేశారు. ఇలాంటి తక్కువ స్కోర్  వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది.  మా బ్యాటింగ్ విభాగం మొత్తం విఫలమవడం దురదృష్టకరం అంటూ చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లు ఎంతో గొప్పగా బౌలింగ్ చేశారు అంటూ తెలిపాడు. ఇక రాబోయే మ్యాచ్ లలో పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు ధోని..

మరింత సమాచారం తెలుసుకోండి: