ఇటీవలే ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ లో జరిగే మ్యాచ్ లో ఓటమి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ నుంచి నిష్క్రమించింది. ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయింది. ఇలాంటి నేపథ్యంలో ఇక ఈ ఏడాది ఛాంపియన్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన చేయడానికి కారణాలు ఏంటి అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి ఎవరో కొత్త ఆటగాళ్లు కారణం కాదు ఏకంగా రిటైన్ చేసుకున్న పాత ఆటగాళ్ళు కారణం అన్నది తెలుస్తుంది. ఏడాది మెగా వేలానికి ముందు రుతురాజ్, రవీంద్ర జడేజా, మోయిన్ అలీ, మహేంద్ర సింగ్ ధోనీ లను రిటన్ చేసుకుంది చెన్నై యాజమాన్యం. అయితే ఇందులో రుతురాజ్ గత ఏడాది చెన్నై తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. కప్పు గెలవడంలో కీలక పాత్ర వహించాడు. అయితే ఇటీవలే చావో రేవో అంటూ ముంబై తో ఆడుతున్న మ్యాచ్లో 7 పరుగులు చేసి విఫలమయ్యాడు. అంతకు ముందు మ్యాచ్ లలో కూడా పెద్దగా రాణించలేదు. కాగా మోయిన్ అలీ అంటిపెట్టుకుంది చెన్నై జట్టు. ఈ స్టార్ ఆల్రౌండర్ కూడా అంచనాలకు తగ్గట్లు ఆడలేకపోయాడు. 8 మ్యాచ్ లలో 130  చేశాడు. ఇక బౌలింగ్ లో 6 వికెట్లు పడగొట్టాడు.


 ఇక ఎప్పుడూ మంచి ప్రదర్శన చేసి ప్రశంసలు అందుకునే రవీంద్ర జడేజా ఈసారి ఒత్తిడికి చిత్తు అయ్యాడు. 16 కోట్లు వెచ్చించి మరీ అతనికి రిటైన్ చేసుకుంది.  కెప్టెన్సీ కూడా అప్పగించింది. కానీ అదే చెన్నై జట్టు పాలిట శాపంగా మారి పోయింది. కెప్టెన్గా కలిసి రాకపోవడమే  కాదు ఒక ఆటగాడిగా కూడా జడేజా విఫలం అయ్యాడు. ఇక ఇప్పుడు చెన్నై జట్టుకీ అతనికి విభేదాలు ఏర్పడ్డాయి అంటు ఊహాగానాలు వస్తున్నాయి.  అయితే కెప్టెన్గా తప్పకున్న ధోనీ కీపర్ గా  బ్యాట్స్మెన్గా ఆకట్టుకుంటాడు అని అందరూ అనుకున్నారు అనుకున్నట్లే తన వంతు పాత్ర  పోషించాడు. గత రాత్రి ముంబై తో జరిగిన భారీ పరుగులు చేయాల్సిన సమయంలో ముప్పై మూడు బంతులు ఆడి 36 పరుగులు చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: