ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం ముగిసింది. ధోనీ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాలతో ప్లే ఆప్ లో అవకాశం దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అనుకున్నప్పటికీ చివరికి కుదరలేదు. ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర ఓటమి చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన రెండవ జట్టు గా నిలిచింది. అంతకు ముందు మరో ఛాంపియన్ జట్టు ముంబై ఇండియన్స్ కూడా ఐపీఎల్ ప్రస్థానం ముగిసింది. దీంతో ప్రస్తుతం అందరిలో ఒకే ప్రశ్న.


 ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో కొనసాగుతాడా అనే ప్రశ్న ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్లో ధోనీ 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడం అతడికి ఫిట్నెస్ కు  నిదర్శనంగా మారింది.. 20 ఓవర్లు క్రీజు ఉండటం.. ఒక గొప్ప విషయం కూడా.  ధోని మైదానంలో నలువైపులా యాక్టివ్గా పరుగులు తీస్తూ ఉండడం చూస్తే అతనికి క్రికెట్ పై ఆసక్తి ఉంది అనడానికి  అద్దం పడుతుంది.


 ధోని కి ఇంకా క్రికెట్ ఆడాలి అని ఉంది అన్న దానికి ఇవే నిదర్శనాలు. చెన్నై జట్టు కష్టాల్లో ఉన్న ప్రతి సారి ధోని ఆదుకున్నాడు. తప్పకుండా ఈ ఎల్లో జెర్సీ తో వచ్చే ఏడాది ఐపీఎల్లో కూడా కనిపిస్తాడు. ధోని వచ్చే సీజన్లో ఉంటాడా లేదా అంటే అతను ఎప్పుడూ చెప్పే డెఫినిట్లీ నాట్ అనే పదమే రిపీట్ అవుతుందని అనుకుంటున్న అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇక అభిమానులు కూడా ధోనీ ఉంటే బాగుండునని కోరుకుంటున్నారు. మరి వచ్చే ఐపీఎల్ సీజన్ లో ధోని అందుబాటులో ఉంటాడా లేదా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు గానే మళ్లీ ఏదైనా షాక్ ఇస్తాడా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: