ఐపిఎల్ సీజన్ 15 లో మ్యాచ్ లు గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. ఈ సారి ఐపిఎల్ లో 10 జట్లు పాల్గొనడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. అయితే రాత్రి ముంబై మరియు చెన్నై ల మధ్య ముగిసిన మ్యాచ్ తో మరొక జట్టు ప్లే ఆప్స్ కు దూరం అయింది. ముంబై చేతిలో చెన్నై ఓడిపోవడం వలన ప్లే ఆప్స్ కు చేరుకోవడానికి ఇక ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. ఇక అంతకు ముందు ముంబై ఈ సీజన్ లో పేలవమైన ప్రదర్శన కారణంగా ప్లే ఆప్స్ కు దూరమైంది. దీనితో ప్లే ఆప్స్ పోటీ 7 జట్ల మధ్యనే ఉంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ప్లే ఆప్స్ కు చేరుకున్న మొదటి జట్టుగా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు మిగిలిన మూడు స్థానాల కోసం ఏకంగా 7 జట్ల మధ్యన తీవ్రమైన పోటీ నెలకొంది.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం లక్నో సులభంగానే ప్లే ఆప్స్ కు చేరుతుంది. ఇక కేవలం రెండు స్థానాల కోసం 6 జట్లు పోటీ పడొచ్చని తెలుస్తోంది. అందులో భాగంగా ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్  మరియు పంజాబ్ కింగ్స్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రోజు మ్యాచ్ లో ఫేవరేట్ అంటే బెంగళూర్ అనే చెప్పాలి. కానీ హార్డ్ హిట్టర్లు ఉన్న పంజాబ్ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ప్రస్తుతం డుప్లిసిస్ నాయకత్వం వహిస్తున్న బెంగుళూరు పాయింట్ల పట్టికలో 12 మ్యాచ్ లలో 7 గెలిచి 14 పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉంది. ఇక మిగిలిన రెండు మ్యాచ్ లలో ఒక మ్యాచ్ గెలిచి కొంచెం రన్ రేట్ ను తెచ్చుకున్నా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది.

కానీ పంజాబ్ కు మాత్రం ఆశలు చాలా తక్కువ అని చెప్పాలి. ప్రస్తుతం పంజాబ్ ఆడిన 11 లో 5 మాత్రమే గెలిచి 10 పాయింట్లతో 8 వ స్థానంలో ఉంది. ఇక మిగిలిన త్రీ మ్యాచ్ లలో గెలిచినా పాయింట్లు 16 అవుతాయి. అప్పుడు భారీ రన్ రేట్ ను సాధిస్తే మిగిలిన జట్లతో పోటీ పడొచ్చు. మరి ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరి పరం అవుతోందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: